ధోనిని వెనక్కి నెట్టడం మా ప్లానే – రవిశాస్త్రీ

మాంచెస్టర్‌: ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో ధోనిని ఏడవ స్థానంలో పంపడం వెనక ఓ వ్యూహం ఉందని కోచ్ రవిశాస్త్రీ వెల్లడించాడు. ధోనిని వెనక్కి నెట్టడంపై మాజీ ఆటగాళ్లు విమర్శిస్తున్న నేపథ్యంలో రవిశాస్త్రీ ఈవిధంగా స్పందించాడు. ధోని అనుభవం టాప్ ఆర్డర్ కంటే లోయర్ ఆర్డర్ కు చాలా అవసరమని.. అందుకే పంత్, పాండ్య తర్వాత అతడిని బ్యాటింగ్ కు పంపినట్లు ఆయన వెల్లడించాడు. ఈ నిర్ణయాన్ని మేమంతా అలోచించి తీసుకున్నాం. ఐదు […]

ధోనిని వెనక్కి నెట్టడం మా ప్లానే - రవిశాస్త్రీ
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 13, 2019 | 4:22 PM

మాంచెస్టర్‌: ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో ధోనిని ఏడవ స్థానంలో పంపడం వెనక ఓ వ్యూహం ఉందని కోచ్ రవిశాస్త్రీ వెల్లడించాడు. ధోనిని వెనక్కి నెట్టడంపై మాజీ ఆటగాళ్లు విమర్శిస్తున్న నేపథ్యంలో రవిశాస్త్రీ ఈవిధంగా స్పందించాడు. ధోని అనుభవం టాప్ ఆర్డర్ కంటే లోయర్ ఆర్డర్ కు చాలా అవసరమని.. అందుకే పంత్, పాండ్య తర్వాత అతడిని బ్యాటింగ్ కు పంపినట్లు ఆయన వెల్లడించాడు.

ఈ నిర్ణయాన్ని మేమంతా అలోచించి తీసుకున్నాం. ఐదు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన తరుణంలో ధోని బ్యాటింగ్ కు వచ్చి తొందరగా ఔట్ అయితే ఛేజింగ్ చాలా కష్టమయ్యేది. అందుకే అతడి అనుభవం చివర్లో వాడుకోవాలని ఇలా చేశాం అని శాస్త్రీ తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నాడు. ధోని గొప్ప ఫినిషర్ అని అందరికి తెలుసు. అతడు చివర్లో ఏ బంతిని ఎలా ఆడాలో పూర్తి అవగాహన ఉంది. కానీ అతడు రనౌట్‌ కావడం దురదృష్టకరమని.. అప్పుడు అతడి ముఖంలో విచారం స్పష్టంగా కనిపించిందని రవిశాస్త్రి వివరించాడు.

ఇక చెత్త షాట్ కొట్టి ఔటైన పంత్‌ను రవిశాస్త్రీ వెనకేసుకొచ్చాడు. పంత్‌కు అనుభవం తక్కువ.. పైగా ఇలాంటి టోర్నీలు ఇంతకముందు ఆడలేదు. అందుకే కాస్త ఒత్తిడికి లోనయ్యాడని ఆయన అన్నారు. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైనా.. రవీంద్ర జడేజా, ధోని కనబరిచిన ఆటతీరు అమోఘం అని రవిశాస్త్రీ ప్రశంసించాడు.