Sachin Tendulkar: క్రికెట్ దేవుడికి మరో గొప్ప గౌరవం.. ఈ పురస్కారం చాలా స్పెషల్.. గతంలో వారికి మాత్రమే
2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మాస్టర్ బ్లాస్టర్ తన కెరీర్‌లో ఎన్నో తిరుగులేని రికార్డులు సృష్టించాడు. తన ఆటతీరుతో క్రికెట్ ప్రపంచంలో కోట్లాది మంది అభిమానులతో పాటు లెక్కలేనన్నీ అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ క్రికెట్ దేవుడు ఖాతాలో మరో ఘనత చేరనుంది.

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ గతంలో ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్నాడు. భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న తో పాటు అర్జున్ అవార్డు, ఖేల్ రత్న, పద్మశ్రీ, పద్మ విభూషణ్, మహారాష్ట్ర భూషణ్ తదితర పురస్కారాలు సచిన్ కీర్తి కిరీటంలో చేరాయి. అలాగే, ఐసీసీ, బీసీసీఐ కూడా సచిన్‌ను పలు క్రీడా అవార్డులతో సత్కరించాయి. ఇప్పుడు మరో గొప్ప గౌరవాన్ని అందుకోనున్నాడు సచిన్. శనివారం (ఫిబ్రవరి 1న) అంటే రేపు జరిగే బీసీసీఐ వార్షిక అవార్డు వేడుకలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌ను లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించనున్నట్లు సమాచారం. ముంబైలోని ప్రధాన కార్యాలయంలో జరగనున్న ఈ అవార్డు వేడుకలో బీసీసీఐ సచిన్ టెండూల్కర్‌ను లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించనుంది. గతేడాది జరిగిన వార్షిక అవార్డు వేడుకలో రవిశాస్త్రి, మాజీ వెటరన్ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజనీర్ కల్నల్ CK నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు.
సచిన్ భారత్ తరఫున రికార్డు స్థాయిలో 200 టెస్టులు, 463 ODIలు ఆడాడు. అంటే మొత్తం 664 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఈ కాలంలో టెస్టుల్లో 15921 పరుగులు, వన్డేల్లో 18426 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీల రికార్డు కూడా సచిన్ పేరిట ఉంది. ఈక్రమంలోనే బీసీసీఐ సచిన్ ను కల్నల్ CK నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు తో సత్కరించేందుకు సిద్ధమైంది.
గతంలో…
CK నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు విషయానికి వస్తే.. సచిన్ కంటే ముందు భారత క్రికెట్‌లోని కొందరు మాత్రమే ఈ గౌరవాన్ని అందుకున్నారు. చివరిసారి అంటే 2023లో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రికి ఈ అవార్డు లభించింది. అతని కంటే ముందు లాలా అమర్‌నాథ్, సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే, కెఎన్ ప్రభు, హేము అధికారి, సుభాష్ గుప్తే, మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ కూడా ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్నారు. వీరితో పాటు సునీల్ గవాస్కర్, బిబి నింబాల్కర్, చందు బోర్డే, బిషన్ సింగ్ బేడి, ఎ వెంకటరాఘవన్, ఇఎఎస్ ప్రసన్న, బిఎస్ చంద్రశేఖర్, మొహిందర్ అమర్‌నాథ్, సలీం దురానీ, అజిత్ వాడేకర్, కపిల్ దేవ్, దిలీప్ వెంగ్‌సర్కర్, సయ్యద్ కిర్మాణి, పద్మాకర్ గోయల్, రాజిందర్ గోయల్ కె. ఫరూక్ ఇంజనీర్‌కు సికె నాయుడు అవార్డు లభించింది.
🚨Great New’s for cricket fans 😍#SachinTendulkar to be honoured with life time achievement award by BCCI 😍#BCCI #Sachin 🤩 pic.twitter.com/RAidENrYqe
— Pradeep Tiwari (@tpradeep113) January 31, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..