ధోని విషయంలో జోక్యం వద్దు..పని చూస్కోండి!- సచిన్

మాంచెస్టర్‌: టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తల నేపథ్యంలో క్రికెట్‌ గాడ్ సచిన్ టెండూల్కర్ స్పందించాడు. రిటైర్మెంట్‌ విషయం ధోనీకే వదిలేయాలని, అందులో ఎవరూ జోక్యం చేసుకోకూడదని అన్నాడు. భారత జట్టుకు ధోనీ అందించిన సేవలను ప్రతీ ఒక్కరూ గుర్తించాలని,  గౌరవించాలని సచిన్ రిక్వెస్ట్ చేశాడు. భారత జట్టులో ధోనిది ప్రత్యేక స్థానమన్న సచిన్… అతడిలాంటి కెరీర్‌ ఎవరికి ఉంటుంది? ప్రశ్నించాడు. ‘ ధోని టీమిండియాకి అందించిన సేవలే ప్రజల […]

ధోని విషయంలో జోక్యం వద్దు..పని చూస్కోండి!- సచిన్
Follow us
Ram Naramaneni

| Edited By: Srinu

Updated on: Jul 11, 2019 | 3:53 PM

మాంచెస్టర్‌: టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తల నేపథ్యంలో క్రికెట్‌ గాడ్ సచిన్ టెండూల్కర్ స్పందించాడు. రిటైర్మెంట్‌ విషయం ధోనీకే వదిలేయాలని, అందులో ఎవరూ జోక్యం చేసుకోకూడదని అన్నాడు.

భారత జట్టుకు ధోనీ అందించిన సేవలను ప్రతీ ఒక్కరూ గుర్తించాలని,  గౌరవించాలని సచిన్ రిక్వెస్ట్ చేశాడు. భారత జట్టులో ధోనిది ప్రత్యేక స్థానమన్న సచిన్… అతడిలాంటి కెరీర్‌ ఎవరికి ఉంటుంది? ప్రశ్నించాడు.

‘ ధోని టీమిండియాకి అందించిన సేవలే ప్రజల గుండెల్లో నమ్మకానికి అద్దం పడతాయి. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో అతడు ఔటయ్యే వరకు భారత్‌ ఓడిపోలేదు. అతడు గెలిపిస్తాడనే నమ్మకం అందరిలోనూ ఉండింది’ అని సచిన్‌ పేర్కొన్నాడు.