Sachin Tendulkar: భారీ షాట్‌లు కొట్టడం సులభం, కానీ సింగిల్స్ కీలకం.. టీ20 వరల్డ్‌ కప్‌పై సచిన్‌ మార్క్‌ విశ్లేషణ..

ఇప్పుడు క్రికెట్‌ అభిమానలంతా టీ20 వరల్డ్‌ కప్‌ కోసమే ఎదురు చూస్తున్నారు. ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ను కైవలం చేసుకోవాలని పలు దేశాలు జట్లు చూస్తున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్, ఆతిథ్య ఆస్ట్రేలియా మరో గొప్ప ప్రదర్శన ఇవ్వాలని చూస్తుండగా...

Sachin Tendulkar: భారీ షాట్‌లు కొట్టడం సులభం, కానీ సింగిల్స్ కీలకం.. టీ20 వరల్డ్‌ కప్‌పై సచిన్‌ మార్క్‌ విశ్లేషణ..
Sachin Tendulkar about t20 world cup
Follow us
Narender Vaitla

| Edited By: Anil kumar poka

Updated on: Oct 22, 2022 | 5:50 PM

ఇప్పుడు క్రికెట్‌ అభిమానలంతా టీ20 వరల్డ్‌ కప్‌ కోసమే ఎదురు చూస్తున్నారు. ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ను కైవలం చేసుకోవాలని పలు దేశాలు జట్లు చూస్తున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్, ఆతిథ్య ఆస్ట్రేలియా మరో గొప్ప ప్రదర్శన ఇవ్వాలని చూస్తుండగా, భారత్‌తోపాటు పాకిస్తాన్, ఇతర పెద్ద జట్లు ట్రోఫీని గెలవాలని కోరుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం క్వాలిఫయర్ మ్యాచ్‌లు చివర దశలో ఉన్నాయి. శనివారం నుంచి సూపర్ 12 మ్యాచ్‌లు మొదలుకానున్నాయి.

ఈ క్రమంలోనే భారత క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ టీ20 మ్యాచ్‌లపై తనదైన విశ్లేషణ చేశారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ముఖ్యంగా టీ20 మ్యాచ్‌లో పరుగులకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని ఆయన తెలిపాడు. ఆస్ట్రేలియాలో ఉండే పెద్ద మైదానంలో వికెట్ల మధ్య పరుగులు అద్భుతం చేస్తాయని సచిన్‌ చెప్పాడు. భారీ షాట్‌లతో పాటు వికెట్ల మధ్య పరుగులు ఆస్ట్రేలియాలో కీలకంగా మారనున్నాయని ఈ లెజండరీ ప్లేయర్‌ సూచించారు. సింగిల్స్‌ గురించి టెండూల్కర్‌ మాట్లాడుతూ.. ‘బంతి స్టంప్‌ల ముందు ఉన్నప్పుడు అది స్ట్రైకర్‌ కాల్‌ అని, బంతి అవతలి క్రీజ్‌ను దాటినప్పుడు అది నాన్‌ స్ట్రైకర్‌ కాల్‌ అని అంటుంటారు. కానీ దీనిని అంగీకరించను. నా దృష్టిలో బంతి ఎక్కడున్నా బ్యాట్స్‌మెన్‌ కాల్‌ కీలకం. ఎంత వేగంగా బంతిని షాట్‌ కొట్టాడు, బంతి ఎక్కడికి వెళ్తుతుంది లాంటి అంశాలు అందరికంటే ఎక్కువగా బ్యాట్స్‌మెన్‌కే తెలుస్తుంది. కాబట్టి కచ్చితంగా బ్యాట్స్‌మెన్‌ కాల్‌పైనే పరుగులు ఆధారపడి ఉంటాయి’ అని చెప్పుకొచ్చాడు.

ఇక ఆస్ట్రేలియాలో ఉన్న భారీ మైదానాల్లో బౌండరీలతో సమానంగా పరుగులు చేస్తే అద్భుతాలు చేయొచ్చని టెండూల్కర్‌ సూచించారు. అంతేకాకుండా రన్నింగ్ చేసే సమయంలో బ్యాట్‌ను చేతులో పట్టుకొని పరిగెత్తడం వల్ల మరింత వేగంగా పరిగెత్తగలమని టెండూల్కర్‌ వివరించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..