AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: నమీబియా ఇంటికి.. డ్యాన్సులు వేస్తూ సంబరాలు చేసుకున్న నెదర్లాండ్‌ ప్లేయర్లు.. వీడియో మాములుగా లేదుగా

శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ ఓటమి పాలైంది. అయితే మ్యాచ్‌ ముగిసిన తర్వాత నెదర్లాండ్స్‌ ఆటగాళ్లు తమ హోటల్‌కు వెళ్లకుండా యూఏఈ-నమీబియా మ్యాచ్‌ను వీక్షించారు. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో నమీబియా గెలిస్తే రన్‌రేట్‌ పరంగా సూపర్‌-12 అడుగుపెట్టేది.

T20 World Cup: నమీబియా ఇంటికి.. డ్యాన్సులు వేస్తూ సంబరాలు చేసుకున్న నెదర్లాండ్‌ ప్లేయర్లు.. వీడియో మాములుగా లేదుగా
Cricketers Dance
Basha Shek
|

Updated on: Oct 21, 2022 | 9:27 AM

Share

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌-2022 తొలి రౌండ్‌ పోటీలు ముగిశాయి. రేపటి నుంచి కీలకమైన సూపర్‌-12 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. కాగా గ్రూప్‌-ఎ నుంచి నెదర్లాండ్స్‌, శ్రీలంక జట్లు సూపర్‌-12 అర్హత సాధించాయి. జీలాంగ్‌ వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో నమీబియా పరాజయం పాలవ్వడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు నమీబియా ఓటమి చెందడంతో నెదర్లాండ్స్‌ సూపర్‌-12కు అర్హత సాధించింది. కాగా గురువారం జరిగిన తొలి రౌండ్ చివరి మ్యాచ్‌లో యూఏఈ 9 పరుగుల తేడాతో నమీబియాను ఓడించింది. తమ తొలి మ్యాచ్‌లోనే శ్రీలంకను ఓడించిన నమీబియా సూపర్-12కు చేరుకోవడానికి ఈ మ్యాచ్‌లో విజయం సాధించాల్సి ఉంది. అయితే ఆ జట్టు బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. జట్టులో అనుభవజ్ఞుడైన డేవిస్ వీసా చివరి వరకు పోరాడి నప్పటికీ విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు. దీంతో టోర్నీ నుంచి నిష్ర్కమించక తప్పలేదు. అంతకుముందు శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ ఓటమి పాలైంది. అయితే మ్యాచ్‌ ముగిసిన తర్వాత నెదర్లాండ్స్‌ ఆటగాళ్లు తమ హోటల్‌కు వెళ్లకుండా యూఏఈ-నమీబియా మ్యాచ్‌ను వీక్షించారు. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో నమీబియా గెలిస్తే రన్‌రేట్‌ పరంగా సూపర్‌-12 అడుగుపెట్టేది.

కాగా అఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో యూఏఈ విజయం సాధించగానే డచ్ ఆటగాళ్ళు సెలబ్రేషన్‌లో మునిగితేలిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే నెదర్లాండ్స్ కేవలం అదృష్టంతో సూపర్-12కి చేరలేదు. గత ఏడాది డచ్ జట్టు మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించింది. అయితే ఈసారి ఈ జట్టు తన పూర్తి బలాన్ని ప్రదర్శించింది. నెదర్లాండ్స్ తొలి మ్యాచ్‌లో యూఏఈని ఓడించి, రెండో మ్యాచ్‌లో నమీబియాను ఓడించింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ పోరాడి ఓడింది. ఇప్పుడు గ్రూప్-2లో భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌తో పాటు సూపర్-12లో నెదర్లాండ్స్‌కు చోటు దక్కింది. భారత్‌త వర్సెస్‌ నెదర్లాండ్‌ మ్యాచ్ అక్టోబర్ 27న జరగనుంది. ఇక గ్రూప్‌-బి నుంచి ఏ జట్లు సూపర్‌-12లో అడుగుపెడతాయో శుక్రవారం తేలిపోనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
స్టార్ల వైఫల్యంపై ముంబై కోచ్ జయవర్ధనే షాకింగ్ కామెంట్స్
స్టార్ల వైఫల్యంపై ముంబై కోచ్ జయవర్ధనే షాకింగ్ కామెంట్స్
ఇన్వర్టర్ Vs కన్వర్టిబుల్.. ఈ రెండిటిల్లో ఏది మంచిది..?
ఇన్వర్టర్ Vs కన్వర్టిబుల్.. ఈ రెండిటిల్లో ఏది మంచిది..?
పట్టపగలు తుపాకులతో గోల్డ్‌ షాప్‌లోకి చొరబడిన దొంగలు.. తర్వాత సీన్
పట్టపగలు తుపాకులతో గోల్డ్‌ షాప్‌లోకి చొరబడిన దొంగలు.. తర్వాత సీన్
ఇంటి డోర్‌ దగ్గర ఈ ఒక్కటి పెడితే ఆ చిక్కులన్నీ మాయం..
ఇంటి డోర్‌ దగ్గర ఈ ఒక్కటి పెడితే ఆ చిక్కులన్నీ మాయం..
మెచ్యూర్ కానీ అమ్మాయిలే టార్గెట్.. OTTలో రియల్ క్రైమ్ స్టోరీ
మెచ్యూర్ కానీ అమ్మాయిలే టార్గెట్.. OTTలో రియల్ క్రైమ్ స్టోరీ
కనకాంబరాలు గుత్తులు గుత్తులుగా పూయాలంటే ఇవి ఇవ్వండి..
కనకాంబరాలు గుత్తులు గుత్తులుగా పూయాలంటే ఇవి ఇవ్వండి..
కేవలం వాటర్ తాగితే సరిపోదూ.. కిడ్నీలోని రాళ్లు పోవాలంటే..
కేవలం వాటర్ తాగితే సరిపోదూ.. కిడ్నీలోని రాళ్లు పోవాలంటే..
సెట్‏లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. ఇప్పుడు చూస్తే గర్వంగా ఉంది..
సెట్‏లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. ఇప్పుడు చూస్తే గర్వంగా ఉంది..
మా టైం బాగోలేదు.. ఈ సీజన్ మాది కాదు.. హార్దిక్ సంచలన వ్యాఖ్యలు
మా టైం బాగోలేదు.. ఈ సీజన్ మాది కాదు.. హార్దిక్ సంచలన వ్యాఖ్యలు
4 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్..
4 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్..