AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2022: చివరి మ్యాచ్‌లో నమీబియా ఘోర పరాజయం.. గ్రూప్ ఏ నుంచి సూపర్ 12 చేరిన రెండు జట్లు ఏవంటే?

Namibia vs United Arab Emirates: నమీబియా ఓటమితో గ్రూప్ ఏ నుంచి సూపర్ 12లోకి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు గ్రూప్ 1, గ్రూప్ 2లో చేరాయి.

T20 World Cup 2022: చివరి మ్యాచ్‌లో నమీబియా ఘోర పరాజయం.. గ్రూప్ ఏ నుంచి సూపర్ 12 చేరిన రెండు జట్లు ఏవంటే?
T20wc2022 Uae Vs Nam
Venkata Chari
|

Updated on: Oct 20, 2022 | 6:00 PM

Share

టీ20 ప్రపంచకప్‌లో వరుసగా రెండోసారి అద్భుతాలు చేయాలన్న నమీబియా కల చెదిరిపోయింది. రౌండ్ 1 చివరి గ్రూప్ మ్యాచ్‌లో నమీబియాను యూఏఈ టీం 9 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో సూపర్-12లో చేరే అవకాశాలను చేర్చాచుకుని, స్వదేశానికి వెళ్లనుంది. దీంతో శ్రీలంక, నెదర్లాండ్స్ సూపర్-12లో చోటు దక్కించుకున్నాయి. నమీబియా ఓటమి భారత్‌కు శుభవార్త కూడా అందించింది. ఎందుకంటే ఆసియా కప్‌లో టీమిండియాకు చుక్కలు చూపించి, లీగ్‌లోనే ఇంటి బాట పట్టించిన శ్రీలంక టీం.. గ్రూప్2 లో చేరలేదు. లంక జట్టుకు బదులుగా నెదర్లాండ్స్ జట్టు సూపర్-12లో భారత్‌తో గ్రూప్-2లో చేరింది.

అక్టోబరు 20 గురువారం నాడు గీలాంగ్‌లో గ్రూప్ ఏ మ్యాచ్‌లు జరిగిన సంతగి తెలిసిందే. ఇందులో శ్రీలంక టీం నెదర్లాండ్స్‌ను ఓడించి సూపర్-12లో తమ స్థానాన్ని దక్కించుకుంది. అయితే భారత్-పాకిస్థాన్ గ్రూప్‌కి వెళ్తుందా లేదా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్‌తో వెళుతుందా అనే దానిపైనే అందరి కళ్ళు పడ్డాయి. ఇందుకోసం నమీబియా, యూఏఈ మధ్య మ్యాచ్ కోసం అంతా ఎదురుచూశారు. ఇక్కడ నమీబియా గెలిస్తే గ్రూప్‌లో మొదటి స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఓడిపోవడంతో నెదర్లాండ్స్‌ను సూపర్-12లో రెండో స్థానానికి చేర్చింది.

టాస్ గెలిచిన యూఏఈ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. నమీబియా అత్యుత్తమ బౌలింగ్ ముందు, UAE చాలా నెమ్మదిగా తన ఆటను ప్రారంభించింది. అది చివరికి జట్టు స్కోరును ప్రభావితం చేసింది. ఓపెనర్ ముహమ్మద్ వాసిమ్ అత్యధికంగా 50 పరుగులు చేశాడు. అయితే అతని ఇన్నింగ్స్ నెమ్మదిగా ఉంది. చివరి ఓవర్లో కెప్టెన్ రిజ్వాన్ 29 బంతుల్లో 43 పరుగులు చేయగా, బాసిల్ హమీద్ 14 బంతుల్లో 25 పరుగులు చేసి జట్టును 148 పరుగులకు చేర్చాడు.

ఇవి కూడా చదవండి

ప్రతిస్పందనగా నమీబియా చాలా దారుణంగా తన ఇన్నింగ్స్ ఆరంభించింది. కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్‌తో సహా మొత్తం టాప్, మిడిల్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. నమీబియా 13వ ఓవర్ వరకు కేవలం 69 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఇక్కడ నుంచి నమీబియా ఓటమి ఖాయమనిపించింది. కానీ, డేవిడ్ వీసా తన అనుభవాన్ని ఉపయోగించి జట్టుకు విజయంపై ఆశలు కల్పించాడు. ఈ డాషింగ్ బ్యాట్స్‌మెన్ కేవలం 36 బంతుల్లో 55 పరుగులు చేశాడు. చివరి ఓవర్‌లో కేవలం 14 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. అయితే, కీలక సమయంలో వీసా ఔట్ అయ్యాడు. చివరికి నమీబియా 139 పరుగులకే ఆలౌటవ్వడంతో యూఏఈ విజయం సాధించింది. దీంతో ఈ రెండు జట్లు క్వాలిఫయర్స్ నుంచే ఇంటి బాట పట్టాయి.