పసికూన చేతిలో శ్రీలంక చిత్తు.. సూపర్-12 భారత గ్రూప్ పై ప్రభావం ఎంత ??
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న పొట్టి ప్రపంచకప్ టోర్నీలో సంచలనాలు నమోదవుతున్నాయి. తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో మాజీ ఛాంపియన్ శ్రీలంకను..
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న పొట్టి ప్రపంచకప్ టోర్నీలో సంచలనాలు నమోదవుతున్నాయి. తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో మాజీ ఛాంపియన్ శ్రీలంకను.. పసికూన నమీబియా చిత్తు చేసింది. దీంతో ఆసియా కప్ విజేత అయిన శ్రీలంకకు గట్టి షాక్ తగిలింది. భారీ తేడాతో ఓడటం నెట్ రన్ రేట్ పైనా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. అయితే.. శ్రీలంక ఓటమి సూపర్-12 గ్రూప్ లపై ఏ మేరకు ప్రభావం చూపించనుందో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం రెండు క్వాలిఫయర్ గ్రూప్ ల నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు మాత్రమే సూపర్-12కు అర్హత సాధిస్తాయి. టీమిండియా ఉన్న సూపర్ 12 గ్రూప్ లో పాక్, బంగ్లాదేశ్, దక్షణాఫ్రికా ఉన్నాయి. క్వాలిఫయర్ మ్యాచ్ ల అనంతరం గ్రూప్ ‘బి’ విజేత, గ్రూప్ ‘ఎ’ రన్నరప్ జట్లు ఇందులో చేరనున్నాయి. ఇక, మంచి దూకుడు మీదున్న వెస్టిండీస్ విజేతగా గ్రూప్ ‘బి’లో ఫేవరెట్ గా నిలిచే అవకాశాలున్నాయి. కాగా, గ్రూప్-ఎ నుంచి సూపర్ 12కు అర్హత సాధించాలంటే శ్రీలంక తన తర్వాతి రెండు మ్యాచ్ ల్లో తప్పక గెలవాలి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Brahmastra OTT: ‘బ్రహ్మాస్త్ర’ ఓటీటీ డేట్ వచ్చేసిందోచ్.. ఎప్పుడో తెలుసా ??
Samantha Yashoda: రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోన్న యశోద !!
ఆదిపురుష్ దర్శకుడికి అదిరిపోయే గిఫ్ట్ !! ఇచ్చింది ఎవరో తెలుసా ??