AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: విజయానికి 7 పరుగుల దూరం.. కట్‌చేస్తే.. 2 బంతుల్లో ఎవ్వరూ ఊహించని రిజల్ట్..

SA vs NZ T20: చివరి ఓవర్లో దక్షిణాఫ్రికాకు 6 బంతుల్లో 7 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. అలాగే తుఫాన్ బ్యాట్స్‌మెన్ డెవాల్డ్ బ్రెవిస్, జార్జ్ లిండే క్రీజులో ఉండటంతో, దక్షిణాఫ్రికా విజయం దాదాపుగా ఖాయం అయింది. కానీ, మాట్ హెన్రీ వేసిన చివరి ఓవర్ హై డ్రామాకు సాక్ష్యంగా నిలిచింది.

Video: విజయానికి 7 పరుగుల దూరం.. కట్‌చేస్తే.. 2 బంతుల్లో ఎవ్వరూ ఊహించని రిజల్ట్..
Sa Vs Nz T20
Venkata Chari
|

Updated on: Jul 27, 2025 | 4:45 PM

Share

SA vs NZ T20: క్రికెట్‌లో క్యాచ్‌లు మ్యాచ్‌లు గెలిపిస్తాయనే సామెత ఉంది. దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది మరోసారి నిరూపితమైంది. జింబాబ్వే, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య జరిగిన ట్రై-సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ తలపడ్డాయి.

హరారేలోని స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా 19 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.

చివరి ఓవర్లో దక్షిణాఫ్రికాకు 6 బంతుల్లో 7 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. అలాగే తుఫాన్ బ్యాట్స్‌మెన్ డెవాల్డ్ బ్రెవిస్, జార్జ్ లిండే క్రీజులో ఉండటంతో, దక్షిణాఫ్రికా విజయం దాదాపుగా ఖాయం అయింది. కానీ, మాట్ హెన్రీ వేసిన చివరి ఓవర్ హై డ్రామాకు సాక్ష్యంగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

20వ ఓవర్ తొలి బంతికి డెవాల్డ్ బ్రెవిస్ ఒక్క పరుగు కూడా చేయలేదు. రెండో బంతికి డీప్ మిడ్-వికెట్ వైపు అద్భుతమైన షాట్ కొట్టాడు. ఆ బంతి బౌండరీ లైన్ దాటి సిక్సర్‌గా మారబోతుండగా, మైఖేల్ బ్రేస్‌వెల్ బౌండరీ లైన్‌పై నిలబడి అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు.

తరువాత కార్బిన్ బాష్ వచ్చి 3వ బంతికి 2 పరుగులు చేశాడు. దీంతో చివరి 3 బంతుల్లో 5 పరుగులు అవసరం అయ్యాయి. బాష్ 4వ బంతికి 1 పరుగు కోసం పరుగెత్తాడు. అనంతరం స్ట్రైక్ తీసుకున్న జార్జ్ లిండే, 5వ బంతికి భారీ షాట్ ఆడాడు. బంతి బౌండరీ లైన్ దాటబోతుంది. ఈ సమయంలో, వచ్చిన డారిల్ మిచెల్ అద్భుతమైన డైవింగ్ క్యాచ్ పట్టాడు.

ఫలితంగా, దక్షిణాఫ్రికాకు చివరి బంతికి 4 పరుగులు అవసరం. మాట్ హెన్రీ ఈ బంతిని డాట్ చేసి న్యూజిలాండ్‌కు 3 పరుగుల తేడాతో ఉత్కంఠభరితమైన విజయాన్ని అందించాడు.

దక్షిణాఫ్రికా సులభంగా గెలవగలిగే మ్యాచ్‌ను మైఖేల్ బ్రేస్‌వెల్, డారిల్ మిచెల్ అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఫలితాన్ని మార్చేశారు. ఈ మలుపుతో, న్యూజిలాండ్ 3 పరుగులతో ఉత్కంఠభరితమైన విజయంతో ముక్కోణపు సిరీస్‌ను గెలుచుకుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..