Video: భార్య బౌలింగ్.. భర్త బ్యాటింగ్.. 6 బంతుల్లో 36 పరుగుల ఛాలెంజ్.. చివరికి ఏం జరిగిందంటే?

Ruturaj Gaikwad and his Wife Challenge: రుతురాజ్ గైక్వాడ్ గురించి మాట్లాడితే, అతను 2023 జూన్ 3న ఉత్కర్షను వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఈజోడీ ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఉత్కర్ష గురించి మాట్లాడితే, ఆమె రైట్ ఆర్మ్ మీడియం పేసర్. 2021 సంవత్సరంలో మహారాష్ట్ర తరపున లిస్ట్ A క్రికెట్ ఆడింది. కానీ, ఆ తర్వాత క్రికెట్‌లో పురోగతి సాధించలేకపోయింది. అయితే, ఉత్కర్ష న్యూట్రిషన్, ఫిట్‌నెస్ సైన్సెస్ కూడా చదివింది.

Video: భార్య బౌలింగ్.. భర్త బ్యాటింగ్.. 6 బంతుల్లో 36 పరుగుల ఛాలెంజ్.. చివరికి ఏం జరిగిందంటే?
Ruturaj Gaikwad vs Utkarsha Pawar
Follow us

|

Updated on: Apr 19, 2024 | 1:50 PM

Ruturaj Gaikwad and his Wife Challenge: ఐపీఎల్ 2024 (IPL 2024) సీజన్‌కు ముందు, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ రుతురాజ్ గైక్వాడ్‌కు భారీ బహుమతిని ఇచ్చింది. తన కెప్టెన్సీ భారాన్ని గైక్వాడ్ భుజాలపై వేసి మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న సీఎస్‌కే కెప్టెన్సీ బాధ్యతను గైక్వాడ్ బాగానే నిర్వర్తిస్తున్నాడు. అయితే, ఇంతలో లక్నోతో మ్యాచ్‌కు ముందు గైక్వాడ్, అతని భార్య ఉత్కర్ష క్రికెట్ ఛాలెంజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గైక్వాడ్‌కు సవాలు విసిరిన అతని భార్య ఉత్కర్ష..

వాస్తవానికి, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ సూపర్ కపుల్ పేరుతో ఒక వీడియోను రూపొందించింది. ఇందులో చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తన భార్య ఉత్కర్షతో కలిసి కనిపించాడు. ఈ వీడియో చివర్లో, రుతురాజ్ గైక్వాడ్, అతని భార్య మధ్య క్రికెట్ ఛాలెంజ్ నిర్వహించారు. ఆ వీడియోలో గైక్వాడ్ మొదట తన భార్య ఉత్కర్షతో నీ ముందు నేను 6 బంతుల్లో 36 పరుగులు చేయగలను అంటూ చెప్పుకొచ్చాడు. దీనిపై అతని భార్య, లేదు, మీరు చేయలేరు, నేను మీకు 6 బంతుల్లో 10 పరుగుల ఛాలెంజ్ ఇవ్వాలనుకుంటున్నాను అంటూ ఛాలెంజ్ చేసింది. దీంతో గైక్వాడ్ సవాలును స్వీకరించాడు. ఇక చివరి బంతికి యార్కర్‌ను వేయగా, గైక్వాడ్ స్పందించలేకపోయాడు. దీంతో 6 బంతులు, 10 పరుగులతో మ్యాచ్ టై అయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

రుతురాజ్ గైక్వాడ్ భార్య కూడా క్రికెటర్..

రుతురాజ్ గైక్వాడ్ గురించి మాట్లాడితే, అతను 2023 జూన్ 3న ఉత్కర్షను వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఈజోడీ ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఉత్కర్ష గురించి మాట్లాడితే, ఆమె రైట్ ఆర్మ్ మీడియం పేసర్. 2021 సంవత్సరంలో మహారాష్ట్ర తరపున లిస్ట్ A క్రికెట్ ఆడింది. కానీ, ఆ తర్వాత క్రికెట్‌లో పురోగతి సాధించలేకపోయింది. అయితే, ఉత్కర్ష న్యూట్రిషన్, ఫిట్‌నెస్ సైన్సెస్ కూడా చదివింది. ఐపీఎల్ 2024 సీజన్‌లో గైక్వాడ్ ఇప్పటి వరకు చెన్నై జట్టును ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌ల్లో విజయతీరాలకు చేర్చాడు. చెన్నై జట్టు ఇప్పుడు తన తదుపరి మ్యాచ్‌ని ఏప్రిల్ 19న లక్నో సూపర్ జెయింట్‌తో ఆడనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..