AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్కై, కోహ్లీ, బట్లర్ జుజుబీ.. టీ20లకే మొగుడు.. డబుల్ సెంచరీ కొట్టేది ఆ ప్లేయరే..

క్రికెట్ ఫ్యాన్స్‌ను పిచ్చెక్కిస్తుంది పొట్టి ఫార్మాట్. ధనాధన్ టీ20 అంటే చాలు.. బౌండరీలు, సిక్సర్ల మోత మోగిపోవాల్సిందే. ఈ ఫార్మాట్‌లో బ్యాటర్లదే హవా. బౌలర్లు కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తారు. ఇటీవల జరుగుతోన్న ఐపీఎల్ 2024 ఇందుకు నిదర్శనం అని చెప్పొచ్చు..

స్కై, కోహ్లీ, బట్లర్ జుజుబీ.. టీ20లకే మొగుడు.. డబుల్ సెంచరీ కొట్టేది ఆ ప్లేయరే..
Mumbai Indians
Ravi Kiran
|

Updated on: Apr 19, 2024 | 1:36 PM

Share

క్రికెట్ ఫ్యాన్స్‌ను పిచ్చెక్కిస్తుంది పొట్టి ఫార్మాట్. ధనాధన్ టీ20 అంటే చాలు.. బౌండరీలు, సిక్సర్ల మోత మోగిపోవాల్సిందే. ఈ ఫార్మాట్‌లో బ్యాటర్లదే హవా. బౌలర్లు కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తారు. ఇటీవల జరుగుతోన్న ఐపీఎల్ 2024 ఇందుకు నిదర్శనం అని చెప్పొచ్చు. ఎన్నడూ లేనట్టుగా ఈ సీజన్‌లో టాప్ 5 అత్యధిక భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఒకప్పుడు ఐపీఎల్‌లో 200 పరుగులు కొట్టాలంటే.. అదొక రేర్ ఫీట్‌లా ఉండేది. అయితే ఇప్పుడు అది సర్వసాధారణమైపోయింది. ఒక్కోసారి టీ20 క్రికెట్‌లో 200 పరుగులు కొట్టినా గెలుపు సాధ్యం కానీ పరిస్థితులు వచ్చేశాయి. ప్రస్తుతం బ్యాటర్లందరూ కూడా 200కి పైగా స్ట్రైక్‌ రేటుతో బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ఇలాంటి తరుణంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో న్యూజిలాండ్ బ్యాటర్ కేన్ విలియమ్సన్‌ను ఐపీఎల్‌లో ఎవరు ఫస్ట్ 200 కొడతారు అని అడిగితే.? దానికి అతడు చెప్పిన సమాధానం ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

టీ20లలోనే కాదు.. ఐపీఎల్‌లోనూ డబుల్ సెంచరీ కొట్టే సత్తా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు ఉందని జోస్యం చెప్పాడు కేన్ మామ. వన్డే క్రికెట్‌లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన రోహిత్.. ఐపీఎల్‌లోనూ ఈ ఫీట్ సాధించడం పెద్ద కష్టమేమి కాదని తెలిపాడు. కాగా, ప్రస్తుతం టీ20ల్లో అత్యధిక స్కోరు క్రిస్ గేల్(175) పేరిట ఉండగా.. ర్యాంకుల్లో అగ్రస్థానం సూర్యకుమార్ యాదవ్ దక్కించుకున్నాడు. ఇక రోహిత్ శర్మ.. ఇటీవల చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 105 పరుగులు సాధించిన విషయం తెలిసిందే.

నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!