AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పరుగుల రాణి PT ఉష మాదిరి పరిగెత్తిన మహిళలు.. అది కూడా ఉత్తి కాళ్లతో

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన మహిళల పరుగు పందెం అందరినీ ఆకట్టుకుంది. చీరలు ధరించి, ఉట్టికాళ్లతోనే గ్రామీణ మహిళలు దాదాపు ఒకటిన్నర కిలోమీటరు దూరం పరుగెత్తి తమ సత్తా చాటారు. మాజీ సర్పంచ్ చిన్న మహాదేవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. అనంతరం వారిని పూలమాలలు, శాలువాలతో సన్మానించి డప్పుల మోత మధ్య గ్రామంలో ఊరేగించారు..

పరుగుల రాణి PT ఉష మాదిరి పరిగెత్తిన మహిళలు.. అది కూడా ఉత్తి కాళ్లతో
Saree Running Competition In Kurnool
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Jul 05, 2026 | 7:39 PM

Share

కర్నూలు, జులై 5: పరుగు పందెం అంటే.. టీ షర్ట్, స్ట్రచబుల్ ప్యాంట్, షూస్ అందరిలోనూ ఖచ్చితంగా కనిపిస్తాయి. అలాంటిది ఉట్టికాళ్లతో చీరతో పరుగులు తీస్తున్న గ్రామీణ మహిళల పరుగు పందెం చూస్తే హౌరా అనాల్సిందే. కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం పులికనుమ గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా మాజీ సర్పంచ్ చిన్న మహాదేవ్ అద్వర్యంలో ఆడవాళ్లకు పరుగు పందెం నిర్వహించారు. మగవాళ్లకు దీటుగా దాదాపు ఒకటిన్నర కిలోమీటర్లు పి.టి.ఉశా మాదిరిగా మహిళలు పరుగులు తీశారు. పరుగు పందెంలో గెలిచిన వారికి 2000, 1500, 1000 రూపాయలు చొప్పున ముగ్గురికి బహుమతులు అందజేశారు.

మాజీ సర్పంచ్ మాహదేవ్. ఫస్ట్ ప్రైజ్ అంజనమ్మకు 2000/, ( సెకండ్ ప్రైజ్) నాగవేణికు 1500/- (మూడవ ప్రైస్) సోమక్కకు 1000/. రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెబట్టం.నల్లారెడ్డి, హెబట్టం ఈరన్న, కోసిగి. వీరేష్ , కుప్పగల్ నాగప్ప, పెద్ద మహాదేవ డీలర్, తిమ్మప్ప ఉప సర్పంచ్, ఇంకా గ్రామ పెద్దలు, మహిళలు యువకులు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు గ్రామ గ్రామాల్లో జరుపుకోవాలని మాజీ సర్పంచ్ చిన్న మహాదేవ కొనియాడారు.

పరుగు పందెంలో గెలిచిన మహిళలను పూలమాలలు వేసి శాలువ గప్పి సన్మానించి డప్పులతో గ్రామములో ఊరేగించారు. ఇలాంటి సందర్భాలు ఇంకా చాలా మంచిగా జరుపుకోవాలి వచ్చే కాలంలో ఇంకా మంచిగా జరుపుకుందాం అన్నారు మాజీ సర్పంచ్ మహదేవ్… మహిళల మధ్య ఐక్యతతో పాటు వంటగదికి పరిమితమైన గ్రామీణ మహిళల్లో శారీరక మానసిక దృఢత్వం రావాలంటే ఇలాంటివి నిర్వహించాలని అలాంటి వాటిలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పెద్దలు సూచిస్తున్నారు.

Follow Us