జూలై 4, 2006న మిడ్జల్ ZPTCగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన రేవంత్ రెడ్డి నేడు తెలంగాణ ముఖ్యమంత్రి. 18 ఏళ్ల ఈ ప్రస్థానంలో ఎన్నో విజయాలు, పోరాటాలు. ఓటమిలో ధైర్యం, గెలుపులో నిబద్ధత ఆయన ప్రత్యేకత. ఈ సందర్భంగా తన రాజకీయ జన్మస్థలమైన మిడ్జల్ను సందర్శించి, ప్రజలకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.