RCB vs GT IPL Match Result: గుజరాత్ ను చిత్తు చేసిన ఆర్సీబీ.. ఎనిమిది వికెట్ల తేడాతో విజయం
RCB vs GT IPL Match Result:
IPL 2022 15వ సీజన్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎనిమిది వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ పై విజయం సాధించింది. విరాట్ కోహ్లి (73), కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ (44)ల అద్భుతమైన ఇన్నింగ్స్ తో అదరగొట్టారు. IPL-2022 ప్లేఆఫ్స్‌లో నిలవడానికి బెంగళూరుకు ఈ మ్యాచ్‌లో విజయం అవసరం . అలాంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌లో కోహ్లి, డు ప్లెసిస్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చి జట్టును రేసులో నిలిపారు. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (62 నాటౌట్), రషీద్ ఖాన్ (19 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌తో ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని బెంగళూరు 18.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి సాధించింది.
169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు శుభారంభం లభించింది. విరాట్ కోహ్లి తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. అర్ధ సెంచరీతో టీమ్ ను ఆదుకున్నాడు. అలాగే కెప్టెన్ డు ప్లెసిస్ కూడా తన సత్తా చాటాడు. కోహ్లి ఈ సీజన్‌లో రెండో అర్ధ సెంచరీని నమోదు చేశాడు. అంతకుముందు ఈ సీజన్‌లో కోహ్లీ చేసిన హాఫ్ సెంచరీ కూడా గుజరాత్‌పైనే కావడం విశేషం. అంతే కాదు కోహ్లి T20లో RCB తరపున 7000 పరుగులు పూర్తి చేశాడు కోహ్లీ. వీరిద్దరూ తొలి వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని రషీద్ ఖాన్ బ్రేక్ చేశాడు. 15వ ఓవర్లో డు ప్లెసిస్ అవుట్ అయ్యాడు. 38 బంతుల్లో ఐదు ఫోర్ల సాయంతో 44 పరుగులు చేశాడు డు ప్లెసిస్.
డు ప్లెసిస్ అవుట్ అయిన తర్వాత గ్లెన్ మాక్స్‌వెల్ ఎంట్రీ ఇచ్చాడు. మాక్స్‌వెల్ చెలరేగి ఆడాడు పాండ్యా వేసిన 16వ ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్ బాది మొత్తం 18 పరుగులు చేశాడు. అలాగే 17వ ఓవర్ నాలుగో బంతికి మాథ్యూ వేడ్ కోహ్లీని స్టంపౌట్ చేశాడు. కోహ్లి తన ఇన్నింగ్స్‌లో 54 బంతులు ఎదుర్కొని ఎనిమిది ఫోర్లతో రెండు సిక్సర్లు బాదాడు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్‌కు శుభారంభం లభించింది. వృద్ధిమాన్ సాహా రాగానే ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. అయితే శుభ్‌మన్ గిల్ (1), మాథ్యూ వేడ్ (16)లు ముందుగానే ఔట్ అవ్వడంతో గుజరాత్ జట్టు పవర్‌ప్లేలో 2 వికెట్ల నష్టానికి 38 పరుగులు మాత్రమే చేయగలిగింది. మరో ఎండ్‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సాహాకి మద్దతుగా నిలిచాడు. కానీ సాహా (31) రనౌట్ అయ్యాడు. అక్కడి నుంచి పాండ్యా, డేవిడ్ మిల్లర్ జోరుగా బ్యాటింగ్ చేసి 14 ఓవర్లలోనే జట్టును 100 దాటించారు. ఈ భాగస్వామ్యాన్ని హస్రంగ బ్రేక్ చేశాడు. 17వ ఓవర్లో హస్రంగ వేసిన బంతికి మిల్లర్ (34) క్యాచ్ ఔటయ్యాడు. మొత్తంగా గుజరాత్ 5 వికెట్ల నష్టానికి 168 చేసింది. ఆర్సీబీ కేవలం 18.3 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసి విజయం సాధించింది.
మరిన్ని ఇక్కడ చదవండి :