RCB vs GT Highlights, IPL 2022: ఎనిమిది వికెట్ల తేడాతో గుజరాత్ పై బెంగళూరు విజయం
Royal Challengers Bangalore vs Gujarat Titans Live Score in Telugu: IPL 2022లో భాగంగా ముంబైలోని వాఖండే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతోంది. గుజరాత్ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.
IPL 2022 15వ సీజన్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎనిమిది వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ పై విజయం సాధించింది. విరాట్ కోహ్లి (73), కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ (44)ల అద్భుతమైన ఇన్నింగ్స్ తో అదరగొట్టారు. IPL-2022 ప్లేఆఫ్స్‌లో నిలవడానికి బెంగళూరుకు ఈ మ్యాచ్‌లో విజయం అవసరం . అలాంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌లో కోహ్లి, డు ప్లెసిస్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చి జట్టును రేసులో నిలిపారు. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (62 నాటౌట్), రషీద్ ఖాన్ (19 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌తో ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని బెంగళూరు 18.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి సాధించింది.
జట్ల అంచనా
బెంగళూరు: విరాట్ కోహ్లీ, డూప్లిసెస్, రజత్ పాటిదార్, మాక్సివెల్, లోమరర్, దినేష్ కార్తిక్, షబజ్, హసరంగ, హర్షల్ పటేల్, సిదార్థ్ కౌల్, హజిల్‌వుడ్
LIVE NEWS & UPDATES
-
ఆర్సీబీ విజయం..
ఎనిమిది వికెట్ల తేడాతో గుజరాత్ పై ఆర్సీబీ విజయం సాధించింది..
-
మరో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ..
కోహ్లీ కోల్పోయిన ఆర్సీబీ.. 76 పరుగులు చేసిన కోహ్లీ 146 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.
-
-
తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ..
44 పరుగులు చేసి అవుట్ అయిన డుప్లిసిస్ .. స్కోర్ 115/1
-
ఆఫ్ సెంచరీతో అదరగొట్టిన కోహ్లీ..
అదరగొడుతున్న కోహ్లీ.. 36 బంతుల్లో 52 పరుగులతో రాణిస్తున్న కోహ్లీ..
-
10 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్ ఎంతంటే..
రాణిస్తున్న ఆర్సీబీ.. 10 ఓవర్లు ముగిసే సమయానికి 88/0
-
-
ఆరు ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ స్కోర్
ఆచితూచి ఆడుతున్న ఆర్సీబీ.. ఆరు ఓవర్లు ముగిసేసరికి 55/0
-
దూకుడుగా ఆడుతున్న బెంగళూరు.
బెంగళూరు దూకుడుగా ఆడుతోంది. కోహ్లీ, డుప్లెసిస్ దూకుడుగా ఆడుతున్నారు.
-
బెంగళూరు బ్యాటింగ్‌కు దిగింది
బెంగళూరు రాయల్స్ ఛాలెంజర్స్ బ్యాటింగ్‌కు దిగింది.
-
165 పరుగులు చేసిన గుజరాత్ టైటాన్స్
గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది.
-
హాఫ్ సెంచరీ చేసిన హార్దిక్ పాండ్యా
హార్ధిక్ పాండ్యా హాఫ్ సెంచరీ చేశాడు.
-
ఐదో వికెట్ కోల్పోయిన గుజరాత్
గుజరాత్ టైటాన్స్ ఐదో వికెట్ కోల్పోయింది. తెవాటియా కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
-
మిల్లర్ ఔట్..
గుజరాత్ నాలుగో వికెట్ కోల్పోయింది. మిల్లర్ ఔటయ్యాడు.
-
15 ఓవర్లకు 119/3
గుజరాత్ టైటాన్స్ 15 ఓవర్లకు మూడు వికెట్ల్ కోల్పోయి 119 పరుగులు చేసింది. క్రీజ్‌లో హార్దిక్, మిల్లర్ ఉన్నారు.
-
మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్
గుజరాత్ టైటాన్స్ మూడో వికెట్ కోల్పోయింది. వృద్ధిమాన్ సాహా రనౌట్ అయ్యాడు
-
రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్
గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. మాథ్యు వేడ్ 16 పరుగులకి ఔటయ్యాడు. దీంతో 5.2 ఓవర్లలో గుజరాత్ రెండు వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది.
-
5 ఓవర్లకి గుజరాత్ 38/1
5 ఓవర్లకి గుజరాత్ ఒక వికెట్ నష్టపోయి 38 పరుగులు చేసింది. క్రీజులో మాథ్యు వేడ్ 16 పరుగులు, వృద్ధిమాన్ సాహా 21 పరుగులతో ఆడుతున్నారు.
-
5 ఓవర్లకి గుజరాత్ 38/1
5 ఓవర్లకి గుజరాత్ ఒక వికెట్ నష్టపోయి 38 పరుగులు చేసింది. క్రీజులో మాథ్యు వాడే 16 పరుగులు, వృద్ధిమాన్ సాహా 21 పరుగులతో ఆడుతున్నారు.
-
మొదటి వికెట్ కోల్పోయిన గుజరాత్
గుజరాత్ మొదటి వికెట్ కోల్పోయింది. శుభమన్ గిల్ ఒక్క పరుగుకే ఔటయ్యాడు. దీంతో 2.3 ఓవర్లలో గుజరాత్ ఒక వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది.
-
మ్యాచ్ ప్రారంభం.. మొదటి ఓవర్‌లో 14 పరుగులు
ఆర్సీబీ, జీటీ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. మొదటి ఓవర్‌లోనే 14 పరుగులు వచ్చాయి. సాహా వేగంగా ఆడుతున్నాడు.
-
టాస్ గెలిచిన గుజరాత్
గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
-
ఆర్సీబీకి ఈ మ్యాచ్ కీలకం
RCB ఏడు మ్యాచ్‌లు గెలిచి ఆరింటిలో ఓడిపోయింది. 14 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. అయితే, RCB నికర రన్ రేట్ మైనస్ 0.323. గుజరాత్‌పై గెలిస్తే 16 పాయింట్లకు చేరుకుంటుంది.
Published On - May 19,2022 7:13 PM