IPL 2022: సిక్స్‌లు కొడితే మ్యాచ్‌లు గెలవవు.. చివరి వరకు ఉంటే గెలుస్తాయి..!

IPL 2022: ఐపీఎల్ 2022లో భాగంగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో లక్నో

IPL 2022: సిక్స్‌లు కొడితే మ్యాచ్‌లు గెలవవు.. చివరి వరకు ఉంటే గెలుస్తాయి..!
Rinku Singh Bad Shot
Follow us
uppula Raju

|

Updated on: May 19, 2022 | 6:53 PM

IPL 2022: ఐపీఎల్ 2022లో భాగంగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ 2 పరుగుల తేడాతో కోల్‌కతాని ఓడించింది. కానీ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్ కోల్‌కతాని దాదాపు గెలుపు వరకు తీసుకొచ్చి చివరలో అందరిని నిరాశపరిచాడు. కేవలం 15 బంతుల్లోనే 40 పరుగులు చేశాడు. కానీ చివరకి కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. రింకూ సింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కానీ చివరికి ఒక తప్పు చేశాడు. 2 బంతుల్లో 3 పరుగులు అవసరమైనప్పుడు పేలవ షాట్‌ ఆడి ఔట్‌ అయ్యాడు.

చివరి ఓవర్‌లో లక్నో సూపర్‌జెయింట్‌కు 21 పరుగులు కావాలి. స్టోయినిస్ వేసిన తొలి బంతికే రింకూ సింగ్ కవర్స్ దిశలో ఫోర్ కొట్టాడు. తర్వాత అతను వరుసగా రెండు బంతుల్లో సిక్సర్ కొట్టి కోల్‌కతాను విజయానికి దగ్గరగా చేశాడు. 3 బంతుల్లో 5 పరుగులు మాత్రమే కావాలి. నాలుగో బంతికి రింకూ సింగ్ 2 పరుగులు చేసి మళ్లీ స్ట్రయిక్‌లోకి వచ్చాడు. తర్వాత కోల్‌కతాకు 2 బంతుల్లో 3 పరుగులు మాత్రమే అవసరం. కానీ రింకూ ఐదో బంతికే మ్యాచ్‌ను ముగించేందుకు ప్రయత్నించి బంతిని గాల్లోకి లేపాడు. ఎవిన్ లూయిస్ చేతికి చిక్కి ఔటయ్యాడు. బెస్ట్ ఫినిష‌ర్‌గా భావించే ఎంఎస్ ధోని ఎప్పుడూ మ్యాచ్ ఆఖ‌రి బంతి వ‌ర‌కు తీసుకెళ్లాల‌ని చెబుతుంటాడు. అయితే రింకూ ఒక బంతి ముందుగానే మ్యాచ్‌ని ముగించేందుకు ప్రయత్నించాడు. రింకూ సింగ్ నిష్క్రమణ తర్వాత తర్వాతి బంతికే ఉమేష్ యాదవ్ అవుట్ కావడంతో కోల్‌కతా 2 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది.

రింకు ఈ ఓటమి తర్వాత నొప్పితో చాలా బాధపడి ఉండొచ్చు. అయితే ఈ సీజన్‌లో రింకూ అద్బుతంగా రాణించాడు. KKR ప్రధాన కోచ్ బ్రెండన్ మెకల్లమ్ కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పాడు. మెకల్లమ్ మాట్లాడుతూ ‘రింకూ ఖచ్చితంగా ఈ సీజన్‌లో బెస్ట్‌ ప్లేయర్. రాబోయే సంవత్సరాల్లో KKRకి ప్రధాన ఆటగాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ సీజన్‌లో రింకుకి కేవలం 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం లభించింది. ఇందులో 34.80 సగటుతో 174 పరుగులు చేశాడు. ఫినిషర్‌గా రింకూ సింగ్ చక్కటి ఆటను కనబరిచాడు. అతనికి మరిన్ని అవకాశాలు లభించి ఉంటే బహుశా ఈ ఆటగాడు KKRని మెరుగైన స్థితిలో ఉంచేవాడేమో’

ఇవి కూడా చదవండి

మరిన్ని ఐపీఎల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి