IPL 2022: ఐపీఎల్ 2022 నుంచి నిష్క్రమించిన కేన్ విలియమ్సన్.. కారణం ఏంటో తెలుసా..?
IPL 2022: ముంబై ఇండియన్స్‌పై భారీ విజయం సాధించిన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ IPL 2022 నుంచి వైదొలిగి న్యూజిలాండ్‌కు వెళ్లాడు.
IPL 2022: ముంబై ఇండియన్స్‌పై భారీ విజయం సాధించిన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ IPL 2022 నుంచి వైదొలిగి న్యూజిలాండ్‌కు వెళ్లాడు. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. వాస్తవానికి కేన్ విలియమ్సన్ రెండో సారి తండ్రి కాబోతున్నాడు. అతను తన భార్యతో సమయం గడపడానికి బయో బబుల్‌ను విడిచిపెట్టాడు. కేన్ విలియమ్సన్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శన చెప్పుకోతగ్గ ఏమిలేదు. ఈ జట్టు 13 మ్యాచ్‌ల్లో 6 మాత్రమే గెలిచింది. ప్రస్తుతం సన్‌రైజర్స్‌కు ఒక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ప్లేఆఫ్‌కు చేరుకోవాలనే అవకాశాలు ఉన్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో అభిమానులకు తెలియజేసింది. అందులో ఇలా ఉంది.. ‘మా కెప్టెన్ కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్‌కు తిరిగి వెళుతున్నాడు. ఆయన కుటుంబంలో మరో సభ్యుడు రాబోతున్నాడు’.
కేన్ విలియమ్సన్ IPLలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా చెబుతారు. అతను నిలకడైన ఇన్నింగ్స్‌లు ఆడతాడని పేరు. కానీ ఈ సీజన్‌లో ఎక్కువగా పరుగులు చేయలేదు. విలియమ్సన్ 13 మ్యాచ్‌ల్లో కేవలం 19.64 సగటుతో 216 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో కేవలం ఒక అర్ధ సెంచరీ మాత్రమే ఉంది. అతని స్ట్రైక్ రేట్ 93.51. IPL ప్రస్తుత సీజన్ అతని కెరీర్‌లోనే అత్యంత చెత్త ప్రదర్శన. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ 75 ఇన్నింగ్స్‌లలో 36 కంటే ఎక్కువ సగటుతో 2101 పరుగులు చేశాడు. అయితే ఈ సంవత్సరం అతని ప్రదర్శన చాలా మందిని నిజంగా ఆశ్చర్యపరిచింది.
కేన్ విలియమ్సన్ బ్యాటింగ్‌లోనే కాదు కెప్టెన్సీలో కూడా ఫ్లాప్ అని నిరూపించుకున్నాడు. విలియమ్సన్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. అయితే ఆ తర్వాత జట్టు వరుసగా ఐదు మ్యాచ్‌లను గెలుచుకుంది. టాప్ 4లోకి వెళుతున్నట్లు అనిపించింది. అయితే తర్వాత వరుసగా 6 మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఇప్పుడు ఈ జట్టు ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే ఇప్పుడున్న ఒక్క మ్యాచ్‌లో గెలవడమే కాకుండా అదృష్టం కూడా ఉండాలి.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి