AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BCCI: క్రికెట్‌ ప్రేక్షకులకు శుభవార్త చెప్పిన బీసీసీఐ..! ఇక నుంచి స్టేడియాల్లో పండగే..!

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(BCCI) క్రికెట్‌ ప్రేక్షకులకు శుభవార్త అందించింది. దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్‌( India vs South Africa)కు 100 శాతం ప్రేక్షకులను అనుమతించనున్నారని ఏఎన్‌ఐ వర్గాలు తెలిపాయి...

BCCI: క్రికెట్‌ ప్రేక్షకులకు శుభవార్త చెప్పిన బీసీసీఐ..! ఇక నుంచి స్టేడియాల్లో పండగే..!
Bcci
Srinivas Chekkilla
|

Updated on: May 19, 2022 | 5:18 PM

Share

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(BCCI) క్రికెట్‌ ప్రేక్షకులకు శుభవార్త అందించింది. దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్‌( India vs South Africa)కు 100 శాతం ప్రేక్షకులను అనుమతించనున్నారని ఏఎన్‌ఐ వర్గాలు తెలిపాయి. ఐపీఎల్(IPL 2022) తర్వాత దక్షిణాఫ్రికా జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు ప్రేక్షకులకు పూర్తిగా అనుమతించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తుంది. నిజంగానే అభిమానులను పూర్తిగా స్టేడియంలోకి అనుమతిస్తే చాలా రోజుల తర్వాత స్టేడియాలు కిక్కిరిసిపోయే అవకాశం ఉంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ జూన్ 9న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. రెండో మ్యాచ్ జూన్ 12న ఒడిశాలోని కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరగనుంది. మూడో మ్యాచ్ విశాఖపట్నంలోని ఏసీఏ-వీసీఏ స్టేడియంలో జరగనుంది. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం నాలుగో మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఐదో మ్యాచ్ జూన్ 19న బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.

గతంలో కోవిడ్ కారణంగా స్టేడియంలోకి ప్రేక్షకుల రాకను నిషేధించారు. కోవిడ్ వ్యాప్తి తగ్గిన తర్వాత, స్టేడియంలోకి ప్రేక్షకుల ప్రవేశం క్రమంగా ప్రారంభమైనప్పటికీ, పూర్తి స్థాయిలో అనుమతించలేదు. కొన్నిసార్లు 50 శాతం, కొన్నిసార్లు 70 శాతం మంది ప్రేక్షకులు స్టేడియంలోకి అనుమతించారు. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ తర్వాత దక్షిణాఫ్రికాకు ఇదే తొలి టీ20 సిరీస్. ఈ సిరీస్‌ రెండు జట్లకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ సంవత్సరం మరో T20 ప్రపంచ కప్ ఆస్ట్రేలియాలో జరగనుంది. ఈ ప్రపంచ కప్‌లో ఈ రెండు జట్లు ఒకే గ్రూపులో ఉన్నాయి. ఈ గ్రూప్‌లో భారత్‌, దక్షిణాఫ్రికాతోపాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రపంచకప్‌కు సన్నాహక పరంగా ఈ సిరీస్‌ కీలకం కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడవార్తలకు ఇక్కడ క్లిక్‌ చేయండి