KKR vs LSG IPL Match Result: ఉత్కంఠగా సాగిన మ్యాచ్.. రెండు పరుగులతో విజయం సాధించిన లక్నో
కోల్‌కతా నైట్ రైడర్స్ , లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది.
KKR vs LSG IPL Match Result: కోల్‌కతా నైట్ రైడర్స్ , లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. DY పాటిల్ స్టేడియంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం, బౌలర్ల విధ్వంసం జరిగింది. ఈ ఉత్కంఠ మ్యాచ్‌లో కోల్‌కతాను కేవలం 2 పరుగుల స్వల్ప తేడాతో ఓడించి లక్నో సూపర్ జెయింట్ ప్లేఆఫ్ కైవసం చేసుకుంది. ఓపెనర్ క్వింటన్ డి కాక్ అద్భుతమైన సెంచరీ, కెప్టెన్ కెఎల్ రాహుల్ రాణించడంతో.. లక్నో తన చివరి లీగ్ మ్యాచ్‌లో 210 పరుగులు చేసింది. అదే సమయంలో కష్టతరమైన లక్ష్యం ముందు పోరాడి ఓడిన కోల్‌కతా.. గత మ్యాచ్‌లో ఓడి ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ (LSG) ఓపెనర్లు ఇప్పటి వరకు జరగని ఓ రికార్డును సృష్టించారు. క్వింటన్ డి కాక్, కేఎల్ రాహుల్ తుఫాను బ్యాటింగ్‌తో 20 ఓవర్లు మొత్తం క్రీజులో నిలిచి సత్తా చాటారు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్ జట్టు ఒక్క వికెట్ కోల్పోకుండా 210 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో క్వింటన్ డి కాక్ 140 పరుగులు చేయగా, కెప్టెన్ కేఎల్ రాహుల్ 68 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి మధ్య 210 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. ఐపీఎల్‌లో చరిత్రలో వీరిద్దరు అద్భుత రికార్డును సృష్టించారు.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన కోల్‌కత్తా నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. కేవలం రెండు పరుగుల తేడా తో విజయం సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 210 పరుగులు చేయగా.. కోల్‌కత్తా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.
మరిన్ని ఇక్కడ చదవండి :