AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: బట్టలు లేక టవల్ కట్టుకునే హోటల్లో ఉన్న.. షాకింగ్ విషయాలు చెప్పిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ రోవ్‌మన్ పావెల్..

ఐపీఎల్ 2022(IPL 2022)లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ రోవ్‌మన్ పావెల్(Rovman Powell ) షాకింగ్ విషయాలు వెల్లడించాడు...

IPL 2022: బట్టలు లేక టవల్ కట్టుకునే హోటల్లో ఉన్న.. షాకింగ్ విషయాలు చెప్పిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ రోవ్‌మన్ పావెల్..
Ipl 2022 Rovman Powell
Srinivas Chekkilla
|

Updated on: May 10, 2022 | 4:56 PM

Share

ఐపీఎల్ 2022(IPL 2022)లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ రోవ్‌మన్ పావెల్(Rovman Powell ) షాకింగ్ విషయాలు వెల్లడించాడు. హోటల్ గదిలో 2-3 రోజులు టవల్‌లో ఉండాల్సి వచ్చిందని రోవ్‌మన్ పావెల్ చెప్పాడు. ఢిల్లీ క్యాపిటల్స్(DC) పోడ్‌కాస్ట్‌లో రోవ్‌మన్ పావెల్ ఈ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తన లగేజీ విమానయాన సంస్థ వద్ద లేదని ముంబై విమానాశ్రయంలో చెప్పినట్లు పావెల్ చెప్పాడు. తన సామాను పోయిందని తన వద్ద ఒక హ్యాండ్ బ్యాగ్ మాత్రమే ఉందని పావెల్ తెలిపాడు. బట్టలు లేకపోవడం వల్ల తను రెండు, మూడు రోజులు టవల్స్‌తే హోటల్ గదిలో ఉండవలసి వచ్చిందన్నాడు.

IPL 2022 వేలంలో రోవ్‌మన్ పావెల్‌ను 2.80 కోట్ల భారీ ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. కానీ ఎయిర్‌లైన్స్ తప్పు కారణంగా అతను హోటల్‌లో క్వారంటైన్ బస సమయంలో టవల్స్‌లో మాత్రమే ఉండవలసి వచ్చింది. IPL 2022లో పావెల్ ప్రదర్శన మిశ్రమంగా ఉంది. ఈ ఆటగాడు 25.62 సగటుతో 205 పరుగులు చేశాడు. పావెల్ స్ట్రైక్ రేట్ 160 కంటే ఎక్కువగా ఉంది. పావెల్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై 67 పరుగులు చేశాడు. రెండుసార్లు డకౌట్ కూడా అయ్యాడు.

Read  Also.. Dinesh Karthik: ఐపీఎల్‌ 2022లో సత్తా చాటుతున్న దినేష్ కార్తీక్‌.. టీమిండియాలో చోటు దక్కేనా..