Dinesh Karthik: ఐపీఎల్‌ 2022లో సత్తా చాటుతున్న దినేష్ కార్తీక్‌.. టీమిండియాలో చోటు దక్కేనా..

ఐపీఎల్‌ 2022(IPL 2022)లో కొత్త ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ సీజన్‌ టీమిండియాకు చెందిన సీనియర్ ఆటగాళ్లు కొందరు విఫలమవుతుంటే మరికొందరు సత్తా చాటుతున్నారు..

Dinesh Karthik: ఐపీఎల్‌ 2022లో సత్తా చాటుతున్న దినేష్ కార్తీక్‌.. టీమిండియాలో చోటు దక్కేనా..
Dinesh Karthik
Follow us

|

Updated on: May 10, 2022 | 3:07 PM

ఐపీఎల్‌ 2022(IPL 2022)లో కొత్త ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ సీజన్‌ టీమిండియాకు చెందిన సీనియర్ ఆటగాళ్లు కొందరు విఫలమవుతుంటే మరికొందరు సత్తా చాటుతున్నారు. ఐపీఎల్‌ రాణించకపోయనా పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ అక్టోబర్‌లో జరగనున్న T20 మాత్రం వీళ్లు రాణించాల్సిన అవసరం ఉంది. భారత్‌ T20(T20 World Cup) ప్రపంచ కప్‌కు ముందు చాలా ముఖ్యమైన సిరీస్‌లు ఆడాల్సి ఉంది. IPL ముగిసిన వెంటనే భారత జట్టు దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్ ఆడాలి . T20 ప్రపంచ కప్ 2022లో ఆడటానికి ప్రధాన పోటీదారులుగా ఉండే అనేక మంది పేర్లను ఈ T20 సిరీస్‌లో చూడవచ్చు. ఈ పేర్లలో ఒకటి దినేష్ కార్తీక్. ఐపీఎల్‌లో RCB తరఫున గొప్పగా ఆడుతున్నాడు. ఫినిషర్‌గా దినేష్ కార్తీక్ ఎన్నో మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అందించాడు. ఈ ఆటగాడు 3 ఏళ్ల తర్వాత మళ్లీ టీమ్ ఇండియాలో చోటు దక్కించుకునే అవకాశం ఉంది.

2019 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దినేష్ కార్తీక్ ఆడాడు. న్యూజిలాండ్‌తో ఓటమి తర్వాత, దినేష్ కార్తీక్ జట్టు నుంచి తప్పించి అతన్ని మళ్లీ జట్టులోకి తీసుకోలేదు. కానీ IPL 2022 వేలంలో RCB అతన్ని దక్కించుకుంది. దినేష్ కార్తీక్ ఆటతీరు పట్ల టీమిండియా సెలక్టర్లు చాలా సంతోషంగా ఉన్నారని, అతని పేరును దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌కు పరిశీలించబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇన్‌సైడ్ స్పోర్ట్ నివేదిక ప్రకారం, దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో దినేష్ కార్తీక్ ఎంపిక కోసం పోటీదారు అని BCCI సెలెక్టర్ చెప్పారు. నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లందరికీ టీమ్ ఇండియా తలుపులు తెరిచే ఉన్నాయని సెలక్టర్ అన్నారు. మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి, వెటరన్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా కార్తీక్‌ను మ్యాచ్ ఫినిషర్‌గా టీమ్ ఇండియాలో చేర్చాలని డిమాండ్ చేశారు.

ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన దినేష్ కార్తీక్ 68కి పైగా సగటుతో 274 పరుగులు చేశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కార్తీక్ స్ట్రైక్ రేట్ 200 కంటే ఎక్కువ. కార్తీక్ బ్యాట్‌లో ఇప్పటివరకు 21 సిక్స్‌లు, 21 ఫోర్లు వచ్చాయి. చివరి మ్యాచ్‌లో కార్తీక్ 8 బంతుల్లో 30 నాటౌట్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. పంజాబ్ కింగ్స్‌పై 14 బంతుల్లో 32 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్‌పై 23 బంతుల్లో 44 పరుగులు చేశాడు. చెన్నైపై కార్తీక్ 14 బంతుల్లో 34 పరుగులు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఈ ఆటగాడు 34 బంతుల్లో 66 పరుగులు చేశాడు. కష్ట సమయాల్లో దినేష్ కార్తీక్ తనను తాను నిరూపించుకున్నాడు.

Read Also.. Ind Vs Aus: ఆస్ట్రేలియాతో తలపడునున్న రోహిత్ సేన.. IPL తర్వాత టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే..