ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో రన్ మాస్టర్స్ వీళ్లే.. టాప్ 5 లిస్టులో భారత్ నుంచి ఒక్కడే..
మొత్తంగా టాప్ 4 జట్లు సెమీ-ఫైనల్‌కు చేరుకుంటాయి. చాలా మ్యాచ్‌లు అత్యధిక స్కోరింగ్‌గా ఉంటున్నాయి. దీంతో బ్యాట్స్‌మెన్‌లు పరుగుల వర్షం కురిపిస్తున్నారు. పరుగులు చేయడమే కాదు.. సెంచరీలు కూడా బాదేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులు కూడా తమ పేరుతో వన్డే ప్రపంచకప్ చరిత్రలో లిఖిస్తున్నారు. ఈ కథనంలో, ప్రపంచ కప్ 2023లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాట్స్‌మెన్స్ గురించి తెలుసుకుందాం..

World Cup 2023: ఐసీసీ ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుంచి మొదలైంది. జోరుగా సాగుతోంది. ఈ టోర్నీ చివరి మ్యాచ్ నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరగనుంది. ఈ టోర్నీలో భారత్‌తో పాటు పాకిస్థాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, నెదర్లాండ్స్ ఇలా మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి.
అన్ని జట్లు ఒకదానితో ఒకటి ఒక మ్యాచ్ ఆడనున్నాయి. మొత్తంగా టాప్ 4 జట్లు సెమీ-ఫైనల్‌కు చేరుకుంటాయి. చాలా మ్యాచ్‌లు అత్యధిక స్కోరింగ్‌గా ఉంటున్నాయి. దీంతో బ్యాట్స్‌మెన్‌లు పరుగుల వర్షం కురిపిస్తున్నారు. పరుగులు చేయడమే కాదు.. సెంచరీలు కూడా బాదేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులు కూడా తమ పేరుతో వన్డే ప్రపంచకప్ చరిత్రలో లిఖిస్తున్నారు. ఈ కథనంలో, ప్రపంచ కప్ 2023లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాట్స్‌మెన్స్ గురించి తెలుసుకుందాం..
ICC ODI ప్రపంచ కప్ 2023లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాట్స్‌మెన్స్ వీరే..
View this post on Instagram
1- మహ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్) : మ్యాచ్‌లు – 3, పరుగులు – 248, సగటు – 124, హాఫ్ సెంచరీ/సెంచరీ – 1/1, అత్యధిక స్కోరు – 131
2- డెవాన్ కాన్వే (న్యూజిలాండ్): మ్యాచ్‌లు – 3, పరుగులు – 229, సగటు – 114.50, హాఫ్ సెంచరీలు/సెంచరీలు – 0/1, అత్యధిక స్కోరు – 152*
3- రోహిత్ శర్మ (భారతదేశం): మ్యాచ్‌లు – 3, పరుగులు – 217, సగటు – 72.33, హాఫ్ సెంచరీలు/సెంచరీలు – 1/1, అత్యధిక స్కోరు – 131
4- క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా) : మ్యాచ్‌లు – 2, పరుగులు – 209, సగటు – 104.50, హాఫ్ సెంచరీ/సెంచరీ – 0/2, అత్యధిక స్కోరు – 109
5 – కుసల్ మెండిస్ (శ్రీలంక): మ్యాచ్‌లు – 2, పరుగులు – 198, సగటు – 99, హాఫ్ సెంచరీ/సెంచరీ – 1/1, అత్యధిక స్కోరు – 122.
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..