Ind vs Aus: ఇది సార్ హిట్ మ్యాన్ అంటే.. టీమిండియా గెలుపు కోసం సైడ్ అయిన రోహిత్ శర్మ!
అడిలైడ్‌లో జరిగే టెస్టు మ్యాచ్లో కేెఎల్ రాహుల్, యశస్వీ జైస్వాల్ ఓపెనింగ్ చేస్తారని రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చాడు. తాను మిడిల్ ఆర్డర్‌లో ఎక్కడో ఒక్కచోట బ్యాటింగ్‌కి వస్తానని స్పష్టించాడు. యువ ఆటగాళ్లు హర్షిత్ రాణా, నితీష్ రెడ్డిలపై రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు.
రేపటి నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో తాను ఓపెనింగ్ చేయనని కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు ముందే పెద్ద ప్రకటన చేశాడు. పెర్త్ టెస్టు మాదిరిగానే ఈ మ్యాచ్‌లోనూ కేఎల్ రాహుల్ మాత్రమే ఓపెనింగ్ చేస్తాడని రోహిత్ చెప్పాడు. ఈ పింక్ బాల్ టెస్ట్‌లో టాప్ ఆర్డర్ విఫలమయ్యే అవకాశం ఉందని, అందుకే రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్‌లో ఆడుతున్నాడని ఇటీవలే సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
తాజాగా ఈ విషయంపై రోహిత్ శర్మ స్పందించాడు. అడిలైడ్‌లో జరిగే టెస్టు మ్యాచ్లో కేెఎల్ రాహుల్, యశస్వీ జైస్వాల్ ఓపెనింగ్ చేస్తారని తెలిపాడు. మొదటి టెస్టు మ్యాచ్‌లో వారిద్దరి భాగస్యామ్యం టీమిండియా గెలుపులో కీలక ప్రాత పోషిందన్నారు. తాను మిడిల్ ఆర్డర్‌లో ఎక్కడో ఒక్కచోట వస్తానని స్పష్టం చేశాడు. తన తీసుకున్న ఈ నిర్ణయం వ్యక్తిగతంగా కొంచెం కష్టమైనప్పటికి జట్టుకు ఇది మంచిదని చెప్పుకొచ్చారు. అయితే మిడిల్ ఆర్డర్‌లో పరిస్థితిని బట్టి రోహిత్ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది.
అడిలైడ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యువ ఆటగాళ్లు హర్షిత్ రాణా, నితీష్ రెడ్డిలపై రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. ‘హర్షిత్, నితీష్ రాణా పెర్త్‌లో తమ మొదటి మ్యాచ్ ఆడుతున్నారని నాకు ఎప్పుడూ అనిపించలేదు. అతని బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంది. టెస్టు సిరీస్ గెలవాలంటే ఇలాంటి ఆటగాళ్లు కావాలి” అని రోహిత్ పేర్కొన్నాడు. పంత్, జైస్వాల్‌లను కూాడా ప్రశంసించాడు. “జైస్వాల్, గిల్ ఇద్దరూ వేర్వేరు తరాలకు చెందిన ఆటగాళ్లు. మొదట ఆస్ట్రేలియా వచ్చినప్పుడు వాళ్లు ఎలా పరుగులు చేస్తారో అని అనుకున్నాం.. కానీ ఆ ఆటగాళ్లు మ్యాచ్ గెలవడానికి తీవ్రంగా శ్రమిస్తారని” రోహిత్ వెల్లడించాడు.
అడిలైడ్‌లో జరగనున్న పింక్ బాల్ టెస్టు కోసం ఆస్ట్రేలియా తన ప్లే ఎలెవన్‌ని తాజాగా ప్రకటించింది. ఇప్పుడు ఏ కాంబినేషన్‌తో టీమ్ ఇండియా రంగంలోకి దిగుతుందనేది తెలియాల్సి ఉంది. రోహిత్ శర్మ పునరాగమనం తర్వాత కెప్టెన్సీలో మార్పు రావడం ఖాయం. అయితే, ఇదే కాకుండా, టీమ్ మేనేజ్‌మెంట్ ఏమి ఆలోచిస్తోంది? పెర్త్ టెస్టులో ప్లేయింగ్ ఎలెవన్ నుండి ముగ్గురు ఆటగాళ్లను తొలగించవచ్చని సమాచారం. ప్లేయింగ్ ఎలెవెన్‌లో అశ్విన్‌కి చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురైల్, వాషింగ్టన్ సుందర్‌లను పక్కన పెట్టే అవకాశం ఉంది.
టీమిండియా అంచనా ప్లేయింగ్ ఎలెవన్:
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రోహిత్ శర్మ, అశ్విన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్:
ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లాబుచెన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి