రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు!

ఐసీసీ ప్రపంచకప్ 2019లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీం ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన రోహిత్ ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో మొదటిస్థానంలో టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉన్నారు. ప్రపంచకప్‌లో 44 ఇన్నింగ్స్ ఆడిన సచిన్ 6 సెంచరీలు సాధించారు. ఆ తర్వాత అత్యధిక సెంచరీలు సాధించిన రెండో […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:10 pm, Tue, 2 July 19
రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు!

ఐసీసీ ప్రపంచకప్ 2019లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీం ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన రోహిత్ ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో మొదటిస్థానంలో టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉన్నారు. ప్రపంచకప్‌లో 44 ఇన్నింగ్స్ ఆడిన సచిన్ 6 సెంచరీలు సాధించారు. ఆ తర్వాత అత్యధిక సెంచరీలు సాధించిన రెండో భారత ఆటాడిగా రోహిత్ నిలిచాడు. 15 ఇన్నింగ్స్‌లో రోహిత్ 5 సెంచరీలు సాధించాడు. కాగా… కేఎల్ రాహుల్‌తో కలిసి రోహిత్ భారత్‌కు ప్రపంచకప్‌లో తొలి వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. వీరిద్దరు కలిసి తొలి వికెట్‌కు 180 పరుగులు జోడించారు.