Rohit Sharma : రోహిత్ శర్మ కొత్త కారు.. నంబర్ ప్లేట్ వెనుక ఉన్న సీక్రెట్ తెలుసా?
భారత క్రికెట్ స్టార్, కెప్టెన్ రోహిత్ శర్మ తన అద్భుతమైన కార్ల కలెక్షన్‌కు మరో కొత్త కారును జోడించాడు. ఎరుపు రంగు లంబోర్గిని ఉరుస్ ఎస్ఈని కొనుగోలు చేసిన మరుసటి రోజే, ముంబై రోడ్లపై డ్రైవింగ్ చేస్తూ కనిపించాడు. తన కారుతో వెళ్తున్న రోహిత్‌ను చూడగానే అభిమానులు అబ్బురపడిపోయారు.

Rohit Sharma : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన లగ్జరీ కార్ల కలెక్షన్‌కు కొత్తగా ఓ సూపర్ స్పోర్ట్స్ కారును జోడించారు. రెండ్ కలర్లో ఉన్న ఈ లంబోర్గిని ఉరుస్ ఎస్‌ఈ ఇప్పుడు ముంబై వీధుల్లో రోహిత్‌తో కలిసి సందడి చేస్తోంది. ఈ కారు ధర దాదాపు రూ. 4.57 కోట్లు ఉంటుందని అంచనా. ఈ కొత్త కారు గురించి తెలిసిన క్రికెట్ అభిమానులు రోహిత్ శర్మ కారును చూసేందుకు ఆసక్తి చూపించారు. అయితే ఈ లంబోర్గిని కారుకు ఉన్న నంబర్ ప్లేట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
రోహిత్ శర్మ తన లంబోర్గిని కారు కోసం ఒక స్పెషల్, పర్సనల్ నంబర్ ప్లేట్ 3015ను ఎంచుకున్నారు. ఈ నంబర్ వెనుక ఒక ఆసక్తికరమైన కథ దాగి ఉంది. ఈ నంబర్ రోహిత్ ఇద్దరు పిల్లల పుట్టినరోజులను సూచిస్తుంది. అతని కుమార్తె సమైరా పుట్టినరోజు డిసెంబర్ 30 కావడంతో, అందులో 30 అనే నంబర్‌ను తీసుకున్నారు. అదేవిధంగా, కుమారుడు అహాన్ పుట్టినరోజు నవంబర్ 15 కావడంతో 15 అనే నంబర్‌ను తీసుకున్నారు.
ఈ రెండు నంబర్లను కలిపి 3015 అనే నంబర్ ప్లేట్‌ను సృష్టించారు. అంతేకాకుండా ఈ రెండు నంబర్ల మొత్తం (30+15) 45కు సమానం. ఈ 45 అనే నంబర్ రోహిత్ శర్మ తన క్రికెట్ కెరీర్ మొత్తంలో గర్వంగా ధరించిన జెర్సీ నంబర్. గతంలో రోహిత్ వాడిన కారు నంబర్ ప్లేట్ 264గా ఉండేది. ఇది వన్డే క్రికెట్‌లో అతను సాధించిన ప్రపంచ రికార్డు స్కోరు. ఇలా తన జీవితంలో ముఖ్యమైన ఘట్టాలను నంబర్ల రూపంలో కారు నంబర్లలో ప్రతిబింబించడం రోహిత్ శర్మ ప్రత్యేకత.
రోహిత్ కొనుగోలు చేసిన ఈ లంబోర్గిని ఉరుస్ ఎస్‌ఈ కారులో 800హెచ్‌పీ ఇంజిన్, 950ఎన్‌ఎం టార్క్ ఉన్నాయి. ఇది కేవలం 3.4 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ కారు రోహిత్ శర్మ వద్ద ఉన్న లగ్జరీ కార్ల జాబితాలో చేరింది. రోహిత్ వద్ద ఇప్పటికే బీఎండబ్ల్యూ ఎం5 (రూ. 1.99 కోట్లు), మెర్సిడెస్-బెంజ్ జీఎల్‌ఎస్ 400డీ (రూ. 1.58 కోట్లు), మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్ (రూ. 1.98 కోట్లు), రేంజ్ రోవర్ హెచ్‌ఎస్‌ఈ ఎల్‌డబ్ల్యూబీ (రూ. 3.68 కోట్లు) ఉన్నాయి.
Rohit Sharma spotted driving his new Lamborghini SE on Mumbai streets.❤️🔥
The Aura of Boss @ImRo45 🐐 pic.twitter.com/hNOHtEI0tR
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) August 16, 2025
రోహిత్ శర్మ ఇటీవలే ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. ఇక, అతను తన చివరి టెస్ట్ మ్యాచ్ నుంచి రిటైర్ అయ్యారు. అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ అతని అంతర్జాతీయ కెరీర్‌లో చివరి సిరీస్‌గా నిలిచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఆగస్టులో బంగ్లాదేశ్‌తో జరగాల్సిన సిరీస్ రద్దు కావడంతో, భారత్ యొక్క తదుపరి వన్డే మ్యాచ్‌లు అక్టోబర్ 19 నుంచి 25 వరకు ఆస్ట్రేలియాతో జరగనున్నాయి. ఈ సిరీస్ తర్వాత రోహిత్ తన భవిష్యత్ గురించి నిర్ణయం తీసుకుంటారా అనేది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




