AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2025 : బాబర్-రిజ్వాన్ లేకుండానే పాక్ టీం.. ఎలా ఆడతారు? ప్లేయింగ్ XI ఎలా ఉండబోతోంది?

ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలో జరగనుంది. ఈ టోర్నమెంట్ కోసం పాకిస్థాన్ జట్టు ఇప్పటికే ప్రకటించబడింది. కానీ, అందరినీ ఆశ్చర్యపరుస్తూ, ఇద్దరు కీలక ఆటగాళ్లు, మాజీ కెప్టెన్ బాబర్ ఆజం, సీనియర్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ ఈ జట్టులో లేరు.

Asia Cup 2025 : బాబర్-రిజ్వాన్ లేకుండానే  పాక్ టీం.. ఎలా ఆడతారు? ప్లేయింగ్ XI ఎలా ఉండబోతోంది?
Pakistan Cricket Team
Rakesh
|

Updated on: Aug 17, 2025 | 1:40 PM

Share

Asia Cup 2025 : క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి యూఏఈలో ప్రారంభం కానుంది. ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ టోర్నీ కోసం తమ జట్టును ప్రకటించింది. అయితే, జట్టులో చాలా మంది కీలక ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఇద్దరు స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు లేకుండా పాకిస్తాన్ ప్లేయింగ్-11 ఎలా ఉండనుంది, ఏ ఆటగాళ్లకు అవకాశం దక్కుతుందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఆసియా కప్‌లో పాకిస్తాన్ జట్టుకు సల్మాన్ అలీ ఆగా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అతను ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగనున్నాడు. ఓపెనింగ్ బాధ్యతలను యువ ఆటగాళ్లు సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్లకు అప్పగించనున్నారు. ఇటీవల సత్తా చాటడంలో విఫలమవుతున్న సామ్ అయూబ్‌ను పక్కన పెట్టి, ఫర్హాన్‌కు ఓపెనింగ్ అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు.

మూడో స్థానంలో మహ్మద్ హారిస్‌ను ఆడిస్తే, నాలుగో స్థానంలో దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్న హసన్ నవాజ్‌కు అవకాశం ఇవ్వవచ్చని పాకిస్తాన్ జట్టు మేనేజ్‌మెంట్ ఆలోచిస్తోంది. ఆరో స్థానం, ఏడో స్థానంలో ఆల్ రౌండర్లు మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్‌లకు చోటు దక్కనుంది. వీరు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా రాణించగలరు.

పాకిస్తాన్ పేస్ దళం బాధ్యతలను స్టార్ బౌలర్లు షహీన్ షా అఫ్రిది, హారిస్ రవూఫ్‌లు పంచుకోనున్నారు. వీరు పాకిస్తాన్ క్రికెట్‌లో అత్యంత సీనియర్లు అయిన ఫాస్ట్ బౌలర్లలో ఇద్దరు. యూఏఈ పిచ్‌లలో స్పిన్నర్లకు ఎక్కువ సహకారం లభిస్తుంది కాబట్టి, అబ్రార్ అహ్మద్ లేదా హసన్ అలీలలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. అలాగే, యువ స్పిన్నర్ సుఫియాన్ ముకిమ్‌కు ప్లేయింగ్-11లో చోటు దక్కే అవకాశం ఉంది. అతను అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటికే తన స్పిన్‌తో బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెట్టాడు.

పాకిస్తాన్ ప్లేయింగ్-1(అంచనా)

సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, మహ్మద్ హారిస్, హసన్ నవాజ్, సల్మాన్ అలీ ఆగా (కెప్టెన్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షహీన్ షా అఫ్రిది, హారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్, సుఫియాన్ ముకిమ్.

ఆసియా కప్ 2025 కోసం పాకిస్తాన్ కంప్లీట్ జట్టు 

సల్మాన్ అలీ ఆగా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హారిస్ రవూఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలత్, ఖుష్‌దిల్ షా, మహ్మద్ హారిస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సామ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షహీన్ షా అఫ్రిది, సుఫియాన్ ముకిమ్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..