AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: ఆల్ టైం టీమిండియా టీ20 ప్లేయింగ్ 11 ఇదే.. కెప్టెన్‌తోపాటు ఓపెనింగ్ జోడీ అదుర్స్ అంతే..!

Team India T20 All Time XI: రాబిన్ ఉతప్ప ఎంపిక చేసిన ఈ ఆల్ టైమ్ టీ20 జట్టు సమతూకంతో, అత్యంత ప్రమాదకరమైన బ్యాటింగ్, బౌలింగ్ శ్రేణితో కూడి ఉంది. యువతకు, అనుభవానికి సరిగ్గా సరిపోయేలా ఉన్న ఈ డ్రీమ్ టీమ్ మైదానంలోకి దిగితే ప్రపంచంలో ఏ జట్టునైనా మట్టికరిపించడం ఖాయమని అభిమానులు సైతం సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Team India: ఆల్ టైం టీమిండియా టీ20 ప్లేయింగ్ 11 ఇదే.. కెప్టెన్‌తోపాటు ఓపెనింగ్ జోడీ అదుర్స్ అంతే..!
Team India T20 All Time Xi
Venkata Chari
|

Updated on: Jun 30, 2026 | 4:47 PM

Share

Team India T20 All Time XI: భారత క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన టీ20 ఆటగాళ్లతో కూడిన తన ఆల్ టైమ్ అత్యుత్తమ టీ20 జట్టును మాజీ స్టార్ బ్యాటర్ రాబిన్ ఉతప్ప ప్రకటించాడు. ఈ జట్టులో అనేక ఆశ్చర్యకరమైన ఎంపికలతో పాటు, దిగ్గజ ఆటగాళ్లకు చోటు కల్పించడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఓపెనర్లుగా హిట్‌మ్యాన్, అభిషేక్ శర్మ..

ఉతప్ప తన జట్టుకు ఓపెనర్లుగా ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యువ సంచలనం అభిషేక్ శర్మను ఎంపిక చేశాడు. దూకుడుగా ఆడటంలో సిద్ధహస్తుడైన రోహిత్‌తో పాటు, ఐపీఎల్‌లో పరుగుల సునామీ సృష్టించిన యువ రక్తం అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ప్రారంభిస్తే పవర్‌ప్లేలో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనబడటం ఖాయమని ఉతప్ప భావించాడు. అనుభవానికి యువ శరవేగాన్ని జోడిస్తూ చేసిన ఈ ఎంపిక నిజంగా అద్భుతమనే చెప్పాలి.

ఇది కూడా చదవండి: Team India: సిగ్గుండాలి.. సింహానికి హ్యాండిచ్చారు.. కట్‌చేస్తే.. పిల్ల టీంపై దూల తీర్చుకున్నారు..

ఇవి కూడా చదవండి

మిడిలార్డర్‌లో రన్ మెషిన్, సిక్సర్ల కింగ్..

ఇక మూడో స్థానంలో రన్ మెషిన్ విరాట్ కోహ్లీని ఎంపిక చేయగా, నాలుగో స్థానంలో 2007 ప్రపంచకప్ హీరో, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్‌కు చోటు దక్కింది. మిడిలార్డర్ మరింత బలంగా ఉండటానికి ఐపీఎల్ మిస్టర్ సురేష్ రైనాను ఐదో స్థానంలో ఉతప్ప ఉంచారు. ఈ ముగ్గురి కలయిక జట్టుకు అపారమైన అనుభవాన్ని, అలాగే ఏ క్షణంలోనైనా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసే సత్తాను అందిస్తుంది.

కెప్టెన్, వికెట్ కీపర్‌గా మహేంద్ర సింగ్ ధోని..

ఈ అద్భుతమైన నక్షత్రాల కూటమిని నడిపించే బాధ్యతను, వికెట్ల వెనుక మెరుపులా కదిలే బాధ్యతను లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఉతప్ప అప్పగించారు. ధోని సారథ్యంలోని ఈ జట్టు ఏ రకమైన క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొని విజయం సాధించగలదని ఆయన నమ్మకం. మైదానంలో ప్రశాంతంగా ఉంటూ వ్యూహాలు రచించడంలో ధోని తర్వాతే ఎవరైనా అని రాబిన్ మరోసారి నిరూపించారు.

ఆల్‌రౌండర్లుగా పాండ్యా, అక్షర్..

జట్టు సమతుల్యత కోసం హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌లను ఆల్‌రౌండర్లుగా ఎంపిక చేశారు. ఫినిషర్‌గా పాండ్యా, స్పిన్ ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్ జట్టుకు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కీలకమైన వెసులుబాటును కల్పిస్తారు. వీరిద్దరూ జట్టుకు వెన్నుముకలా నిలుస్తారనడంలో సందేహం లేదు.

ఇది కూడా చదవండి: IND vs IRE: ఆ ఇద్దరే టీమిండియాకు పట్టిన దరిద్రం.. అర్జెంటుగా పీకేయండి.. లేదంటే 2వ మ్యాచ్ కూడా..!

బౌలింగ్ విభాగంలో బుమ్రా, చాహల్, అర్ష్‌దీప్..

ప్రధాన స్పిన్నర్‌గా వికెట్ల వీరుడు యుజ్వేంద్ర చాహల్‌ను ఎంచుకోగా, ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో ప్రపంచ అత్యుత్తమ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌లకు చోటు దక్కింది. డెత్ ఓవర్లలో పరుగులను కట్టడి చేయడంలో ఈ బౌలింగ్ విభాగం అత్యంత ప్రమాదకరమైనదిగా మారుతుంది.

రాబిన్ ఊతప్ప ఎంచుకున్న టీమిండియా ఆల్ టైమ్ అత్యుత్తమ టీ20 జట్టు: రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్‌, సురేష్ రైనా, మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్, కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌, యుజ్వేంద్ర చాహల్‌, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us