IPL Mega Auction 2025: ఘోర బైక్ ప్రమాదం తరువాత మళ్ళీ గ్రౌండ్ లో అడుగుపెట్టనున్న క్రిస్ గేల్ ఆఫ్ రాంచీ

రాబిన్ మింజ్, "రాంచీ క్రిస్ గేల్" అని పేరుగాంచిన ఈ యువ ఆటగాడు, సూపర్బైక్ ప్రమాదాన్ని అధిగమించి ఐపీఎల్ 2025 వేలంలో గుజరాత్ టైటాన్స్ కోసం రూ. 3.6 కోట్లతో సంతకం చేశాడు. గతంలో ముంబై ఇండియన్స్‌తో పాత కాంట్రాక్ట్ గల మింజ్, తన శ్రమతో మళ్లీ ఐపీఎల్‌లో సత్తా చాటబోతున్నాడు.

IPL Mega Auction 2025: ఘోర బైక్ ప్రమాదం తరువాత మళ్ళీ గ్రౌండ్ లో అడుగుపెట్టనున్న క్రిస్ గేల్ ఆఫ్ రాంచీ
Robin Minz
Follow us
Narsimha

|

Updated on: Nov 27, 2024 | 11:06 AM

బైక్ ప్రమాదాన్ని అధిగమించి క్రికెట్ మైదానంలో తిరిగి అడుగుపెట్టిన రాబిన్ మింజ్ మరోసారి ఐపీఎల్ ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. “క్రిస్ గేల్ ఆఫ్ రాంచీ” గా ప్రసిద్ధి చెందిన ఈ యువ ఆటగాడు, 2024 సీజన్‌ను అతని కెరియన్ ను ప్రమాదంలో పడేసినప్పటికి తిరిగి కోలుకున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ 2025 వేలంలో గుజరాత్ టైటాన్స్ అతడిని రూ. 3.6 కోట్ల భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేసింది.

దీంతో రాబిన్ మింజ్ కుటుంబ సభ్యులు ఆనందంలో మినిగిపోయారు. రాబిన్ తల్లి మొదటి సారి విమానంలో ప్రయాణించి, తన కొడుకు ప్రదర్శనను ప్రత్యక్షంగా చూడాలని ఎదురుచూసినప్పటికీ.. గత సీజన్‌లో దురదృష్టవశాత్తూ అది సాకారంకాలేదు. ఇప్పుడు, తన కొడుకు మళ్లీ ఐపీఎల్‌లో అడుగుపెట్టడంతో ఆమె ఆనందంతో ఉప్పొంగిపోతోంది. రాబిన్ తండ్రి ఫ్రాన్సిస్ మింజ్, రాంచీ విమానాశ్రయంలో భద్రతా అధికారిగా పని చేస్తూ, తన కొడుకు సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.

రాబిన్ మోటార్‌ సైకిల్‌పై ప్రయాణిస్తున్నప్పుడు జరిగిన ప్రమాదం అతని జీవితాన్ని తారుమారు చేసింది. ఈ ఘటన అతడిని గత సీజన్‌కు మొత్తంగా దూరంగా చేసింది. అయితే, అతని శ్రమ, పట్టుదల అతనికి మళ్లీ అవకాశాన్ని తీసుకొచ్చాయి. ముంబై ఇండియన్స్ మొదట అతనిని రూ. 65 లక్షలకు తీసుకున్న.. 2025 వేలంలో గుజరాత్ టైటాన్స్ అతనిపై బాగా ఆసక్తి చూపి తమ జట్టులో చేర్చుకుంది.

రాంచీ విమానాశ్రయంలో ఫ్రాన్సిస్ మింజ్, మహేంద్ర సింగ్ ధోనీ మధ్య స్నేహపూర్వక సంబంధం ఉడటంతో రాబిన్‌ ను తీసుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తి చూపింది. అయితే, గుజరాత్ టైటాన్స్ మాత్రం అతడిని వదలడానికి ససేమిరా అన్నారు.

ఇప్పుడు, రాబిన్ మింజ్ కేవలం బిగ్ హిట్టర్‌గా మాత్రమే కాకుండా, తిరిగి తన కుటుంబానికి గర్వకారణంగా నిలుస్తున్నాడు. అతను మాకు కాల్ చేసి, తన గెలుపు గురించి చెప్పినప్పుడు మేము ఎంతగానో సంతోషించాము,” అని రాబిన్ తల్లి ఎలిస్ చెప్పింది. రాబిన్ మళ్లీ ఐపీఎల్‌లో అడుగుపెట్టడం, మిండ్జ్ కుటుంబానికి ఒక కొత్త ప్రారంభాన్ని ఇచ్చింది.