ICC Men’s T20 World Cup Sub-Regional Africa: అయ్యబాబోయ్ ఇదెక్కడి చెత్త రికార్డు.. కేవలం 7 పరుగులకే ఆలౌట్

పురుషుల T20I చరిత్రలో ఐవరీ కోస్ట్ 7 పరుగులకు ఆలౌటై అత్యల్ప స్కోరు నమోదు చేసింది. నైజీరియా 271 పరుగులు సాధించి 264 పరుగుల తేడాతో ఐవరీ కోస్ట్‌ను ఓడించింది. ఈ విజయంతో నైజీరియా పురుషుల T20Iలో అతిపెద్ద విజయాల జాబితాలో మూడవ స్థానానికి చేరుకుంది.

ICC Men's T20 World Cup Sub-Regional Africa: అయ్యబాబోయ్ ఇదెక్కడి చెత్త రికార్డు.. కేవలం 7 పరుగులకే ఆలౌట్
Nigeria Bowled Out For Ivory Coast
Follow us
Narsimha

|

Updated on: Nov 27, 2024 | 11:19 AM

లాగోస్‌లో జరిగిన ICC పురుషుల T20 ప్రపంచ కప్ సబ్-రీజినల్ ఆఫ్రికా క్వాలిఫయర్ గ్రూప్ C మ్యాచ్‌లో ఐవరీ కోస్ట్ నైజీరియాతో 264 పరుగుల తేడాతో ఓడిపోవడంతో పురుషుల T20I చరిత్రలో అత్యల్ప స్కోరును నమోదు చేసింది. నైజీరియా ఈ విజయంతో పురుషుల T20Iలలో అతిపెద్ద విజయాల మార్జిన్ల జాబితాలో మూడవ స్థానానికి చేరుకుంది.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన నైజీరియా 4 వికెట్ల నష్టానికి 271 పరుగులు సాధించింది. ఈ ఇన్నింగ్స్‌లో సెలిమ్ సలావ్ 53 బంతుల్లో 112 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. సులైమాన్ రన్‌సేవే 50 పరుగులు, ఐజాక్ ఓక్పే 65 పరుగులు చేసి కీలక పాత్ర పోషించారు.

అనంతరం బౌలింగ్‌లో నైజీరియా పటిష్ఠ ప్రదర్శన కనబరచింది. ఐజాక్ దన్లాడి, ప్రాస్పర్ ఉసేని తలో మూడు వికెట్లు తీసి ఐవరీ కోస్ట్‌ను 7.3 ఓవర్లలో కేవలం 7 పరుగులకు ఆలౌట్ చేశారు. పీటర్ అహో మరో రెండు వికెట్లు సాధించగా, సిల్వెస్టర్ ఓక్పే ఒక వికెట్ రనౌట్ రూపంలో తీసుకున్నాడు. ఐవరీ కోస్ట్ బ్యాటర్లు ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్‌కు చేరుకోవడంతో ఓపెనర్ ఔట్టారా మహ్మద్ 4 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

పురుషుల T20I చరిత్రలో ఇది తొలిసారి ఏదైనా జట్టు సింగిల్ డిజిట్ స్కోర్‌తో ఆలౌటైంది. ఈ ఫార్మాట్‌లో అంతకుముందు మంగోలియా vs సింగపూర్ (సెప్టెంబర్ 2023)- ఐల్ ఆఫ్ మ్యాన్ vs స్పెయిన్ రెండు సందర్భాల్లో అత్యల్ప స్కోరు 10 పరుగులు నమోదైంది.

ఈ విజయంతో నైజీరియా గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచింది, మరోవైపు ఐవరీ కోస్ట్ అట్టడుగు స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ ఐవరీ కోస్ట్‌కు వరుసగా రెండో ఓటమి కాగా, నైజీరియా తన గ్రూప్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది