AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్‌ రెండో టెస్టు.. కెప్టెన్ రోహిత్, కోహ్లీలకు ఐసీసీ బిగ్ షాక్

బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ ఓటమి కారణంగా రోహిత్ శర్మ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

Team India: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్‌ రెండో టెస్టు.. కెప్టెన్ రోహిత్, కోహ్లీలకు ఐసీసీ బిగ్ షాక్
Rohit Sharma, Virat Kohli
Basha Shek
|

Updated on: Oct 23, 2024 | 7:45 PM

Share

పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన గహుంజే స్టేడియంలో గురువారం (అక్టోబర్ 24) నుంచి భారత్, న్యూజిలాండ్  జట్ల మధ్య రెండో టెస్ట్ జరగనుంది. అయితే ఈ రెండో టెస్టుకు ముందే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్‌ల త్రయానికి ఐసీసీ బిగ్ షాక్ ఇచ్చింది. పెద్ద దెబ్బ తగిలింది. అదే సమంయలో టీమిండియా వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ రిషబ్ పంత్ కు ఒక శుభవార్త వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం (అక్టోబర్ 23) టెస్టు ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. బ్యాటర్ల కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్ స్థానాలు దిగజారాయి. అదే సమయంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో రిషబ్ పంత్ రెండో ఇన్నింగ్స్‌లో 99 పరుగులతో సత్తా చాటాడు. దీంతో టెస్ట్ ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ కంటే పంత్ మూడు స్థానాలు ఎగబాకాడు. పంత్ విరాట్‌ను అధిగమించి తొమ్మిదో స్థానం నుంచి నేరుగా ఆరో స్థానానికి చేరుకున్నాడు. పంత్ ఖాతాలో 745 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. కాగా విరాట్ 720 రేటింగ్ పాయింట్లతో ఏడో స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి పడిపోయాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ 70 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ గా వెనుదిరిగాడు.

కెప్టెన్ రోహిత్ కూడా విరాట్ లాగే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 2 స్థానాలు కోల్పోయాడు. 13వ స్థానం నుంచి 15వ స్థానానికి పడిపోయాడు హిట్ మ్యాన్. రోహిత్, శ్రీలంకకు చెందిన దుమిత్ కరుణరత్నే సంయుక్తంగా 15వ స్థానంలో ఉన్నారు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ 2 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 52 పరుగులు చేశాడు. ఇక గాయం కారణంగా శుభ్‌మన్ గిల్ తొలి టెస్టుకు దూరమయ్యాడు. ఇది అతని ర్యాకింగ్ పై ప్రభావం చూపింది. దీంతో నాలుగు స్థానాలు కోల్పోయిన శుభ్‌మాన్ ప్రస్తుతం 20వ స్థానంలో కొనసాగుతున్నాడు. శుభ్‌మన్‌కు 677 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. యశస్వి జైస్వాల్ తన నాలుగో స్థానాన్నినిలబెట్టుకున్నాడు. అదే సమయంలో ఇంగ్లండ్‌ అనుభవజ్ఞుడైన జో రూట్‌ తొలి స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇవి కూడా చదవండి

 Rishabh Pant Surpasses Virat Kohli in ICC Test Rankings List, Rohit Sharma drops two places

రేపటి నుంచే రెండో టెస్ట్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..