Team India: ట్రిపుల్ సెంచరీతో రికార్డ్ ఇన్నింగ్స్.. కట్ చేస్తే.. 26 నెలల తర్వాత భారత జట్టులో చోటు..
Prithvi Shaw: న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20, వన్డే సిరీస్‌ల కోసం టీమిండియాను ప్రకటించారు. చాలా కాలం తర్వాత పృథ్వీ షాకు టీ20 జట్టులో అవకాశం దక్కింది.

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు శుక్రవారం అర్థరాత్రి న్యూజిలాండ్‌తో జరగబోయే టీ20, వన్డే సిరీస్‌ల కోసం టీమిండియా జట్టును ప్రకటించింది. స్టార్ యువ బ్యాట్స్‌మెన్ పృథ్వీ షా చాలా కాలం తర్వాత న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌తో తిరిగి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. రంజీ ట్రోఫీలో 379 పరుగుల రికార్డు బద్దలు కొట్టిన తర్వాతే.. షాకు టీమ్ ఇండియా టికెట్ లభించింది.
26 నెలల తర్వాత తిరిగి జట్టులోకి..
పృథ్వీ షా 26 నెలల సుదీర్ఘ విరామం తర్వాత టీమ్ ఇండియాకు తిరిగి వచ్చాడు. ఈ కాలంలో దేశవాళీ క్రికెట్‌లో పృథ్వీ షా నిలకడగా రాణించినప్పటికీ టీమ్ ఇండియాలో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, రంజీ ట్రోఫీలో షా అస్సాంపై 379 పరుగుల రికార్డు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో అతనికి టీమ్ ఇండియాలో చోటు కల్పించాలని సెలక్టర్లపై ఒత్తిడి పెరిగింది. రంజీ ట్రోఫీకి ముందు, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా పృథ్వీ షా అత్యధిక పరుగులు చేశాడు.
న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో పృథ్వీ షాతో పాటు 29 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జితేష్ శర్మ టీమ్ ఇండియా రిజర్వ్ వికెట్ కీపర్‌గా వ్యవహరించనున్నాడు. కాగా, అంతకుముందు, సంజూ శాంసన్ గాయపడిన తర్వాత అతను శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా అవకాశం పొందాడు. అయితే జితేష్ ఇంకా టీమ్ ఇండియాకు అరంగేట్రం చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో న్యూజిలాండ్‌పై జితేష్ అంతర్జాతీయ అరంగేట్రం చేయగలడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.




న్యూజిలాండ్‌తో సిరీస్‌కు టీం ఇండియా – హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రీతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి, పృథ్వీ షా, ముఖేష్ కుమార్.
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టీ20 సిరీస్ షెడ్యూల్..
భారత్ vs న్యూజిలాండ్, 1వ టీ20 జనవరి 27 – రాంచీ
భారత్ vs న్యూజిలాండ్, 2వ టీ20 జనవరి 29 – లక్నో
ఇండియా vs న్యూజిలాండ్, 3వ టీ20 ఫిబ్రవరి 01 – అహ్మదాబాద్
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..