Ravichandran Ashwin: 500 వికెట్లు తీసేందుకు అశ్విన్‌ ఎన్ని బంతులు వేశాడో తెలుసా?

రాజ్‌ కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న 3వ టెస్టు మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. తన స్పిన్‌తో ఇప్పటికే ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన ఈ సీనియర్‌ ప్లేయర్‌ టెస్టు క్రికెట్‌లో 500 వికెట్లు పూర్తి చేసుకున్నాడు.

Ravichandran Ashwin: 500 వికెట్లు తీసేందుకు అశ్విన్‌ ఎన్ని బంతులు వేశాడో తెలుసా?
రవిచంద్రన్ అశ్విన్: భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఈసారి 2024 టీ20 ప్రపంచకప్‌కు దూరంగా ఉండవచ్చు. వాస్తవానికి, అశ్విన్ తన చివరి T20 మ్యాచ్‌ని 10 నవంబర్ 2022న ఇంగ్లండ్‌తో భారతదేశం తరపున ఆడాడు. ఆ తర్వాత భారత టీ20 జట్టుకు ఎంపిక కాలేదు.
Follow us

|

Updated on: Feb 17, 2024 | 8:55 PM

రాజ్‌ కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న 3వ టెస్టు మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. తన స్పిన్‌తో ఇప్పటికే ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన ఈ సీనియర్‌ ప్లేయర్‌ టెస్టు క్రికెట్‌లో 500 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన భారత్‌లో 2వ బౌలర్‌గా, ప్రపంచంలో 5వ స్పిన్నర్‌గా అశ్విన్ నిలిచాడు, ఓవరాల్‌ గా 9వ బౌలర్ గా నిలిచాడు.దీంతో పాటు మరెన్నో రికార్డులను అశ్విన్ సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 500 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. అంటే అతి తక్కువ టెస్టు మ్యాచ్‌లు, తక్కువ డెలివరీల ద్వారా 500 వికెట్ల మైలురాయిని దాటిన 2వ బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్‌ గ్లెన్ మెక్‌గ్రాత్ అగ్రస్థానంలో ఉన్నాడు. మెక్‌గ్రాత్ కేవలం 25,528 బంతుల్లో ఐదు వందల వికెట్ల మైలురాయిని దాటాడు. తద్వారా టెస్ట్ క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో 500 వికెట్లు తీసిన ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. టీమిండియా స్పిన్నర్ 25,714 బంతుల్లో 500 వికెట్లు తీశాడు. తద్వారా అతి తక్కువ బంతుల్లో 500 వికెట్లు పూర్తి చేసిన ప్రపంచంలో రెండో బౌలర్‌గా నిలిచాడు.

ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ ఈ జాబితాలో 3వ స్థానంలో ఉన్నాడు. అతను టెస్టు క్రికెట్‌లో 28,150 బంతులు వేసి 500 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. బ్రాడీ 28,430 బంతులు వేసి 500 వికెట్ల మైలురాయిని దాటాడు. వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ కోర్ట్నీ వాల్ష్ ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉన్నాడు. వాల్ష్ 28,833 బంతుల్లో 500 వికెట్లు సాధించాడు. శ్రీలంక ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ అతి తక్కువ టెస్టు మ్యాచ్‌ల్లో 500 వికెట్లు తీసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. మురళీధరన్ 87 టెస్టు మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. 98 టెస్టు మ్యాచ్‌ల ద్వారా 500 వికెట్ల మైలురాయిని దాటిన రవిచంద్రన్ అశ్విన్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. తద్వారా అతి తక్కువ టెస్టు మ్యాచ్‌ల్లో 500 వికెట్లు తీసిన 2వ బౌలర్‌గా రికార్డు పుటల్లోకి ఎక్కాడు.

ఇవి కూడా చదవండి

అనారోగ్యంతో అశ్విన్ తల్లి..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి