IND vs ENG: రజత్ పాటిదార్ ఫ్లాప్ షో.. రింకూ సింగ్‌కు ఛాన్స్ ఇవ్వాలంటోన్న ఫ్యాన్స్.. లెక్కలు చూపిస్తూ మరీ..
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో మ్యాచ్ రాజ్‌కోట్ వేదికగా జరుగుతోంది. ఈ సిరీస్‌లో టీమిండియాకు ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు ఎదురవుతున్నాయి. ఓ వైపు ఆటగాళ్ల గాయం ఇబ్బంది అయితే మరోవైపు ఆటగాళ్ల పేలవ ఫామ్ టీమ్ ఇండియా కష్టాలను పెంచుతోంది.

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో మ్యాచ్ రాజ్‌కోట్ వేదికగా జరుగుతోంది. ఈ సిరీస్‌లో టీమిండియాకు ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు ఎదురవుతున్నాయి. ఓ వైపు ఆటగాళ్ల గాయం ఇబ్బంది అయితే మరోవైపు ఆటగాళ్ల పేలవ ఫామ్ టీమ్ ఇండియా కష్టాలను పెంచుతోంది. ఇంతకుముందు శుభ్‌మన్ గిల్ ఫామ్ భయపెట్టినా ఇప్పుడు మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఫామ్ కోల్పోవడంతో శ్రేయాస్ అయ్యర్‌కు జట్టులో చోటు దక్కలేదు. ఇప్పుడు టీమ్ ఇండియా తరఫున అరంగేట్రం సిరీస్ ఆడుతున్న రజత్ పాటిదార్.. రాజ్‌కోట్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 5, సున్నా పరుగులు చేసి టీమ్ ఇండియాకు కొత్త తలనొప్పిగా మారాడు. గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో రజత్ పాటిదార్ 46 పరుగులు మాత్రమే చేశాడు. విశాఖపట్నంలో భారత్ తరఫున అరంగేట్రం చేసిన రజత్ 32, 9 పరుగులు చేశాడు. ఆ తర్వాత రాజ్‌కోట్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 5 పరుగులకే ఔటైనా, రెండో ఇన్నింగ్స్‌లో 10 బంతులు ఆడి ఖాతా తెరవలేకపోయాడు. దీంతో రజత్ పాటిదార్ ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో అతనిని ట్రోల్ చేస్తున్నారు.
రజత్‌ను జట్టు నుండి తొలగించి రింకూ సింగ్‌కు అవకాశం ఇవ్వాలని అంటున్నారు. అలాగే రజత్ పాటిదార్ కంటే రింకూ సింగ్ మంచి బ్యాటర్ అంటూ వీరిద్దరి ఫస్ట్ క్లాస్ క్రికెట్ గణాంకాలను చూపిస్తున్నారు. రజత్ పాటిదార్ కంటే రింకూ యావరేజ్, స్ట్రైక్ రేట్, సెంచరీల సంఖ్య.. ఇలా అన్ని విషయాల్లోనూ బెటర్ గా ఉన్నాడంటున్నారు. రింకు సింగ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు మొత్తం 69 ఇన్నింగ్స్‌లు ఆడి 55 సగటుతో 3173 పరుగులు చేశాడు. ఇందులో 20 అర్ధసెంచరీలు, 7 సెంచరీలు ఉన్నాయి. అలాగే టెస్టులో అతని స్ట్రైక్ రేట్ 72.
IN FC CRICKET
•Rinku Singh
Innings – 69 Runs – 3173 Average – 55 Strike rate – 72 50s/100s – 20/7
•Rajat Patidar
Innings – 95 Runs – 4041 Average – 44 Strike rate – 53 50s/100s – 22/5
-How this uncle made his Test debut before Rinku is beyond comprehension. pic.twitter.com/P4HVYiekMs
— ` (@kurkureter) February 17, 2024
రజత్ పాటిదార్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు 95 ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్‌లు ఆడిన రజత్ 44 సగటుతో 4041 పరుగులు చేశాడు. 53 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన రజత్ రెడ్ బాల్ ఫార్మాట్‌లో మొత్తం 22 అర్ధసెంచరీలు, 5 సెంచరీలు కొట్టాడు.
SuryaKumar Yadav after playing 1 innings in test cricket got dropped.
But rajat patidar who has failed in 4 innings is still getting support from masses shows Hatred for sky.
This is what we call hypocrisy!💔 pic.twitter.com/mc6aRl7gQr
— ᴘʀᴀᴛʜᴍᴇsʜ⁴⁵ (@45Fan_Prathmesh) February 17, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








