IND vs ENG: రాజ్‌కోట్ గ్రౌండ్‌లో రవీంద్ర జడేజా ‘డబుల్ సెంచరీ’.. దిగ్గజ ఆటగాళ్ల క్లబ్‌లో స్టార్ ఆల్‌రౌండర్‌

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్టార్ ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీశాడు. దీంతో పాటు కొన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకు ముందు బ్యాటింగ్‌లోనూ అదరగొట్టాడు జడ్డూ. ఇంగ్లండ్‌ బౌలర్లను చితక బాదుతూ సెంచరీ కొట్టాడు. ఇక బౌలింగ్ లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, టామ్ హార్ట్లీ వికెట్లు తీసిన జడ్డూ..

IND vs ENG: రాజ్‌కోట్ గ్రౌండ్‌లో రవీంద్ర జడేజా 'డబుల్ సెంచరీ'.. దిగ్గజ ఆటగాళ్ల క్లబ్‌లో స్టార్ ఆల్‌రౌండర్‌
Ravindra Jadeja
Follow us

|

Updated on: Feb 18, 2024 | 7:55 AM

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్టార్ ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీశాడు. దీంతో పాటు కొన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకు ముందు బ్యాటింగ్‌లోనూ అదరగొట్టాడు జడ్డూ. ఇంగ్లండ్‌ బౌలర్లను చితక బాదుతూ సెంచరీ కొట్టాడు. ఇక బౌలింగ్ లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, టామ్ హార్ట్లీ వికెట్లు తీసిన తర్వాత రవీంద్ర జడేజా భారత గడ్డపై తన 200 టెస్టు వికెట్లను పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన ఐదో భారత బౌలర్‌గా నిలిచాడు. జడేజా కంటే ముందు అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, హర్భజన్ సింగ్, కపిల్ దేవ్ ఈ ఘనత సాధించారు. ఇప్పుడు ఈ దిగ్గజ ఆటగాళ్ల క్లబ్‌లో జడేజా చేరాడు. భారత గడ్డపై అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్‌గా అనిల్‌ కుంబ్లే ఉన్నాడు. ఈ దిగ్గజ బౌలర్‌ ఖాతాలో 350 టెస్టు వికెట్లు ఉన్నాయి. రవిచంద్రన్ అశ్విన్ 347 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే, ఈ మ్యాచ్‌లో అశ్విన్ 500 టెస్టు వికెట్లు సాధించాడు.

హర్భజన్ సింగ్ 265 వికెట్లతో మూడో స్థానంలో ఉండగా, 1983 ప్రపంచకప్ హీరో కపిల్ దేవ్ 219 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ జాబితాలో చేరిన రవీంద్ర జడేజా 201 వికెట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ మ్యాజిక్ చేసిన జడేజా.. ఈ మ్యాచ్ లోనూ 112 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. 2012లో భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన జడేజా ఆ తర్వాత టీమిండియా తరఫున 70 టెస్టు మ్యాచ్‌లు ఆడి 3005 పరుగులు, 282 వికెట్లు పడగొట్టాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

8 ఫోర్లు, 6 సిక్సర్లతో ప్రీతి జింటా ఫేవరేట్ ప్లేయర్ ఊచకోత..
8 ఫోర్లు, 6 సిక్సర్లతో ప్రీతి జింటా ఫేవరేట్ ప్లేయర్ ఊచకోత..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?
మిస్టర్‌ బచ్చన్ వచ్చేది ఆరోజే.. అనుకున్న తేదీ కంటే ముందుగానే.. .
మిస్టర్‌ బచ్చన్ వచ్చేది ఆరోజే.. అనుకున్న తేదీ కంటే ముందుగానే.. .
‘సీఎం రేవంత్‌ అంకుల్‌.. శునకాల నుంచి మా ప్రాణాలకు రక్షణేది’
‘సీఎం రేవంత్‌ అంకుల్‌.. శునకాల నుంచి మా ప్రాణాలకు రక్షణేది’
ఇదేం రీల్స్ పిచ్చిరా బాబు..300 మొసళ్లు ఉన్న సరస్సులో బైక్ స్టంట్.
ఇదేం రీల్స్ పిచ్చిరా బాబు..300 మొసళ్లు ఉన్న సరస్సులో బైక్ స్టంట్.
ఢిల్లీ ఫ్లైట్ దిగిన రిషభ్ పంత్.. ధోనితో కలిసి ట్రావెలింగ్‌కి రెడీ
ఢిల్లీ ఫ్లైట్ దిగిన రిషభ్ పంత్.. ధోనితో కలిసి ట్రావెలింగ్‌కి రెడీ
ఏపీ, తెలంగాణలో మరో 3 రోజులు వర్షం....
ఏపీ, తెలంగాణలో మరో 3 రోజులు వర్షం....
'మైక్రోసాఫ్ట్‌ సమస్య' చైనాపై ఎందుకు ప్రభావం చూపలేదు.. కారణం ఏంటి?
'మైక్రోసాఫ్ట్‌ సమస్య' చైనాపై ఎందుకు ప్రభావం చూపలేదు.. కారణం ఏంటి?
మోదీ సర్కార్ 3.0 తొలి బడ్జెట్.. తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత!
మోదీ సర్కార్ 3.0 తొలి బడ్జెట్.. తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత!
చల్లటి వెదర్.. మొక్కజొన్న పొత్తు రేటు డబుల్
చల్లటి వెదర్.. మొక్కజొన్న పొత్తు రేటు డబుల్