Watch Video: స్టన్నింగ్ క్యాచ్ తో ఆకట్టుకున్న భారత ప్లేయర్.. పరిగెత్తుతూ, గాల్లోకి ఎగిరి మరీ.. నెట్టింట వీడియో వైరల్..

రాధా యాదవ్ క్యాచ్ పట్టిన తీరు భారత ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపింది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా పైచేయి అప్పటికే భారీగా కనిపించినా.. ఈ క్యాచ్ మరింత ఆధిపత్యం చెలాయించేందుకు..

Watch Video: స్టన్నింగ్ క్యాచ్ తో ఆకట్టుకున్న భారత ప్లేయర్.. పరిగెత్తుతూ, గాల్లోకి ఎగిరి మరీ.. నెట్టింట వీడియో వైరల్..
Radha Yadav Catch Vs Eng
Follow us
Venkata Chari

|

Updated on: Sep 14, 2022 | 1:09 PM

క్యాచ్ లు పడితే, మ్యాచ్ గెలిచినట్లే అనేది క్రికెట్ నానుడి. ఇలాంటి మ్యాచ్ లను మనం చూస్తేనే ఉన్నాం. తాజాగా ఇలాంటి సీనే డెర్బీలో భారత్, ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ లో రాధా అద్భుత క్యాచ్ ఇంగ్లండ్‌ విజయానికి అడ్డంకిగా మారింది. ఒక్క క్యాచ్ ఎలా మ్యాచ్ గెలుస్తుంది అని ఆలోచిస్తున్నారా.. అక్కడికే వస్తున్నాం. రాధా యాదవ్ క్యాచ్ పట్టిన తీరు భారత ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపింది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా పైచేయి అప్పటికే భారీగా ఉంది. ఈ క్యాచ్ తో మరింత ఆధిపత్యం చెలాయించింది.

రాధా స్టన్నింగ్ క్యాచ్..

టాస్ గెలిచిన ఇంగ్లండ్ మహిళలు ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. తొలి టీ20లోనూ రెండో టీ20లోనూ భారత్‌ను ఓడించాలనే ఆశతో బరిలోకి దిగారు. అయితే క్రీజులోకి రాగానే కథ మారిపోయింది. ఇంగ్లండ్ టాప్ 4 బ్యాట్స్‌మెన్ కేవలం 50 పరుగుల వ్యవధిలో డగౌట్‌కు చేరుకున్నారు. ఇంగ్లండ్ మహిళల జట్టును ఇలాంటి పరిస్థితి తీసుకరావడంలో భారత బౌలర్లు కీలక పాత్ర పోషించారు. అయితే నాల్గవ వికెట్ పడేందుకు రాధా యాదవ్ క్యాచ్ కూడా కీలక పాత్ర పోషించింది. 16 పరుగుల వద్ద ఆడుతున్న ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ బ్రయోనీ స్మిత్.. భారీ షాట్ కొట్టింది. ఈ క్రమంలో గాల్లోకి లేచిన బంతిని వెంటాడిన రాధా.. చాలా దూరం పరిగెత్తి, గాల్లోకి ఎగిరి, స్టన్నింగ్ క్యాచ్ పట్టింది. దీంతో ఈ క్యాచ్ చూసిన మిగతా ఆటగాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఈ మ్యాచ్ లో 18 ఏళ్ల క్రీడాకారిణి ఫ్రెయా క్యాంప్ 7వ స్థానంలో నిలిచి అజేయంగా 51 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 142 పరుగులు చేసింది.

స్మృతి మంధాన రికార్డు ఇన్నింగ్స్‌..

స్మృతి మంధాన అద్భుతమైన అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ కారణంగా 142 పరుగుల లక్ష్యాన్ని 17వ ఓవర్లో భారత్ గెలుచుకుంది. స్మృతి బ్యాట్‌తో 79 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ మరో 20 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 29 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.

53 బంతుల్లో తన అసమాన ఇన్నింగ్స్ ఆడిన స్మృతి మంధాన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైంది. దీంతో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో మూడు టీ20ల సిరీస్ 1-1తో సమమైంది.