Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022లో పేలవ ప్రదర్శన.. ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ షాకింగ్ నిర్ణయం..

ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ పదవికి మహేల జయవర్ధనే రాజీనామా చేయడంతో, జహీర్ ఖాన్‌కు పెద్ద బాధ్యత అప్పగించనున్నారు.

IPL 2022లో పేలవ ప్రదర్శన.. ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ షాకింగ్ నిర్ణయం..
Mumbai Indians Head Coach
Follow us
Venkata Chari

|

Updated on: Sep 14, 2022 | 12:47 PM

IPL 2022లో ముంబై ఇండియన్స్ చాలా పేలవమైన ప్రదర్శన తర్వాత, ప్రస్తుతం ఫ్రాంచైజీ పెద్ద నిర్ణయం తీసుకుంది. ముంబై జట్టు మేనేజ్‌మెంట్‌లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ మహేల జయవర్ధనే రాజీనామా చేశారు. అదే సమయంలో ముంబై ఇండియన్స్ క్రికెట్ డైరెక్టర్ జహీర్ ఖాన్ బాధ్యతలో పెద్ద మార్పు జరిగింది. మహేల జయవర్ధనే ఇకపై ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా ఇకపై ఉండరు. జయవర్ధనే ఇప్పుడు ముంబై జట్టుకు పెర్ఫార్మెన్స్ గ్లోబల్ హెడ్‌గా వ్యవహరిస్తారు. ముంబై UAE, దక్షిణాఫ్రికా లీగ్ జట్ల ప్రదర్శన కూడా ఇప్పుడు జయవర్ధన్ చేతిలో ఉంటుంది.

జహీర్ ఖాన్ గురించి మాట్లాడితే, ఇప్పుడు ఈ మాజీ భారత క్రికెటర్ ముంబైలోని మూడు జట్లకు క్రికెటర్ డెవలప్‌మెంట్ హెడ్ అయ్యాడు. ముంబై ఇండియన్స్ అభివృద్ధి బాధ్యతను జహీర్ ఖాన్ తీసుకుంటాడు. ఇప్పుడు ముంబై ఇండియన్స్ కొత్త ప్రధాన కోచ్‌ని నియమించేందుకు సిద్ధమైంది. దక్షిణాఫ్రికా కోచ్ మార్క్ బౌచర్ ఏదైనా IPL జట్టులో ప్రధాన కోచ్‌గా చేరవచ్చని తెలుస్తోంది. బహుశా అతను ముంబై ఇండియన్స్‌ టీంలో చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, పంజాబ్ కింగ్స్‌లో ప్రధాన కోచ్ స్థానం కూడా ఖాళీగా ఉంది.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ చాలా పేలవంగా ఆడింది. ముంబై 14 మ్యాచ్‌ల్లో 4 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.