PBKS vs RR, IPL 2024: రాజస్థాన్‌ను గెలిపించిన హెట్మెయర్.. ఆఖరి ఓవర్‌లో కంగుతిన్న పంజాబ్

|

Apr 13, 2024 | 11:41 PM

Punjab Kings vs Rajasthan Royals: ఐపీఎల్ 2024 టోర్నమెంట్‌లో రాజస్థాన్ రాయల్స్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది. శనివారం (ఏప్రిల్ 03) రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ లో సంజూ శాంసన్ సేన 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసి 148 పరుగులకే ఆలౌటైంది.

PBKS vs RR, IPL 2024: రాజస్థాన్‌ను గెలిపించిన హెట్మెయర్.. ఆఖరి ఓవర్‌లో కంగుతిన్న పంజాబ్
Rajasthan Royals
Follow us on

Punjab Kings vs Rajasthan Royals: ఐపీఎల్ 2024 టోర్నమెంట్‌లో రాజస్థాన్ రాయల్స్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది. శనివారం (ఏప్రిల్ 03) రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ లో సంజూ శాంసన్ సేన 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసి 148 పరుగులకే ఆలౌటైంది. స్వల్ప లక్ష్యమైనా ఛేదనలో రాజస్థాన్ తడబడింది. టాపార్డర్ బ్యాటర్లు విఫలమయ్యారు. చివరి ఓవర్ వరకు ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ గెలిచేలా కనిపించింది. యశస్వి (39), హెట్‌మయర్‌ (27*), తనుష్‌ (24), పరాగ్‌ (23) రాణించడంతో ఒక బంతి ఉండగానే ఆర్ఆర్ విజయం సాధించింది. ముఖ్యంగా ఆఖరి ఓవర్ లో హెట్మెయర్ సిక్స్, ఫోర్ కొట్టడంతో పంజాబ్ కు మళ్లీ నిరాశ తప్పలేదు. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. పాయింట్ల పట్టికలో 10 పాయింట్లతో ఆ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. అంతేకాదు ప్లేఆఫ్ దిశగా రాజస్థాన్ రాయల్స్ మరో అడుగు ముందుకేసింది. మిగిలిన 8 మ్యాచ్‌ల్లో 3 గెలిస్తే రాజస్థాన్ కు ప్లేఆఫ్ స్థానం ఖాయం. అంతకు ముందు పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసి 148 పరుగులకే ఆలౌటైంది. రాజస్థాన్ రాయల్స్ ఒక వికెట్ కోల్పోయి ఈ సవాలును పూర్తి చేసింది. ఈ ఓటమి కారణంగా పోటీలో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్ అవకాశాలు క్లిష్టంగా మారాయి.

పంజాబ్ కింగ్స్ 148 పరుగుల విజయాన్ని ఛేదించేందుకు యశస్వి జైస్వాల్, తనుష్ కోటియన్ రంగంలోకి దిగారు. వరుసగా విఫలమవుతోన్న యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్‌లో కాస్తా నిలకడగా ఆడాడు. తనుష్ తో కలిసి తొలి వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే లియామ్ లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో కోటియన్ ఔటయ్యాడు. అతను 31 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 24 పరుగులు చేశాడు. ఆ తర్వాత యశస్వి జైస్వాల్ 39, సంజు శాంసన్ 18, రియాన్ పరాగ్ 23, ధ్రువ్ జురెల్ 6, రోవ్‌మన్ పావెల్ 11, కేశవ్ మహరాజ్ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఆఖరిలో షిమ్రాన్ హెట్మెయర్ 10 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్ల సాయంతో అజేయంగా 27 పరుగులు చేసి రాజస్థాన్ విజయాన్ని ఖాయం చేశాడు. పంజాబ్‌ బౌలర్లలో సామ్‌ కరన్‌ 2, రబాడా 2, లివింగ్‌స్టోన్‌ 1, అర్ష్‌దీప్‌సింగ్‌ 1, హర్షల్‌ పటేల్‌ 1 వికెట్ తీశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి