పాక్ జట్టు పొగబెట్టి పొమ్మన్నది.. కట్ చేస్తే.. 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 132 పరుగులు బాదేశారు.. ఎవరంటే?
ఈ ఇద్దరు ఆటగాళ్ళను పాకిస్తాన్ జాతీయ జట్టు పొగబెట్టి పొమ్మన్నది. కట్ చేస్తే..
ఈ ఇద్దరు ఆటగాళ్ళను పాకిస్తాన్ జాతీయ జట్టు పొగబెట్టి పొమ్మన్నది. కట్ చేస్తే.. డొమెస్టిక్ క్రికెట్‌లో దుమ్ములేపారు. కానీ చివరికి తమ జట్టుకు మాత్రం విజయాన్ని అందించలేకపోయారు. మరి వారెవరు.? ఆ మ్యాచ్ ఏంటో.? ఇప్పుడు తెలుసుకుందామా.?
మంగళవారం కరాచీ కింగ్స్, పెషావర్ జల్మి మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. చివరి బంతి వరకు రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో పెషావర్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇందులో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ జల్మి నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ అజామ్(68), కద్మోర్(92) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
ఇక 200 పరుగుల భారీ టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన కరాచీ కింగ్స్ జట్టుకు సీనియర్ బ్యాటర్ షోయాబ్ మాలిక్(52) కెప్టెన్ ఇమాద్ వసీమ్(80) అద్భుత ఇన్నింగ్స్‌లతో జట్టును విజయం అంచుల వరకు తీసుకెళ్లారు. అయితే 19 ఓవర్‌లో మాలిక్ ఔట్ కావడం, రియాజ్ వేసిన పదునైన డెత్ బౌలింగ్‌కు కరాచీ కింగ్స్ చివరికి 2 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కాగా, కద్మోర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..