AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్‌లతో ప్రధాని మోదీ భేటీ.. ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా?

PM Modi meets Indian Women's blind T20 World Cup champions: దీపిక టి.సి. సారథ్యంలోని భారత జట్టు, ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో నేపాల్‌ను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్‌లో 27 బంతుల్లో 44 పరుగులు చేసిన ఫులా సరెన్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ టోర్నమెంట్‌ను భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించాయి.

PM Modi: టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్‌లతో ప్రధాని మోదీ భేటీ.. ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా?
Pm Modi Meet Blind Players
Venkata Chari
|

Updated on: Nov 27, 2025 | 8:57 PM

Share

నేపాల్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి, ప్రారంభ అంధుల టీ20 మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న భారత జట్టును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఢిల్లీలో గురువారం ఈ విజేత జట్టుతో ప్రధాని ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఆప్యాయంగా పలకరించిన ప్రధాని..

Pm Modi

వరల్డ్ కప్ గెలిచిన జట్టు సభ్యులను మోదీ ఆప్యాయంగా పలకరించారు. క్రీడాకారిణులకు స్వీట్లు పంచిపెట్టి వారిని సత్కరించారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులు తాము సంతకం చేసిన బ్యాట్‌ను ప్రధానికి బహుమతిగా అందించగా, మోదీ కూడా ఒక క్రికెట్ బంతిపై సంతకం చేసి వారికి తిరిగి బహుకరించారు. ప్రతి క్రీడాకారిణితోనూ ఆయన ఫోటోలు దిగి, వారి విజయానికి శుభాకాంక్షలు తెలిపారు.

చరిత్ర సృష్టించిన భారత జట్టు..

Pm Modi

దీపిక టి.సి. సారథ్యంలోని భారత జట్టు, ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో నేపాల్‌ను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్‌లో 27 బంతుల్లో 44 పరుగులు చేసిన ఫులా సరెన్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ టోర్నమెంట్‌ను భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించాయి.

మోదీ ప్రశంసల జల్లు..

Pm Modi

అంతకుముందు, భారత జట్టు విజయంపై ట్విట్టర్ (X) వేదికగా ప్రధాని స్పందించారు. “అంధుల మహిళల టీ20 వరల్డ్ కప్ ప్రారంభ ఎడిషన్‌ను గెలిచి చరిత్ర సృష్టించిన భారత జట్టుకు అభినందనలు. ఈ సిరీస్‌లో అజేయంగా నిలవడం మరింత గర్వకారణం. మీ కఠోర శ్రమ, టీమ్ వర్క్, పట్టుదల భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం” అని మోదీ కొనియాడారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..