Legends League Cricket : దుమ్మురేపిన పఠాన్ బ్రదర్స్.. వరల్డ్ జెయింట్స్‌పై ఇండియా మహారాజాస్ గ్రాండ్ విక్టరీ
India Maharajas vs World Giants: లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో భాగంగా ఇండియా మహారాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్ జరిగింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా బీసీసీఐ ప్రత్యేకంగా ఈ మ్యాచ్‌ను నిర్వహించింది.
India Maharajas vs World Giants: లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో భాగంగా ఇండియా మహారాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్ జరిగింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా బీసీసీఐ ప్రత్యేకంగా ఈ మ్యాచ్‌ను నిర్వహించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండియా మహారాజాస్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వరల్డ్ జెయింట్స్ విధించిన 171 పరుగుల లక్ష్యాన్ని 8 బంతులు ఉండగానే అందుకుంది ఇండియా మహారాజాస్. తన్మయ్ శ్రీవాస్తవ (39 బంతుల్లో 54, 8 ఫోర్లు, ఒక సిక్స్), యూసుఫ్ పఠాన్ (35 బంతుల్లో 50) అర్ధసెంచరీలతో రాణించగా, చివర్లో ఇర్ఫాన్ పఠాన్ (9 బంతుల్లో 20, 3 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన వరల్డ్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. కెవిన్ ఒబ్రెయిన్ (52), దినేశ్ రామ్‌దిన్ (42) రాణించారు. ఇండియా మహారాజాస్ బౌలర్ పంకజ్ సింగ్ ఐదు వికెట్లతో చెలరేగగా హర్భజన్ సింగ్, జోగిందర్ శర్మ, మహ్మద్ కైఫ్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇండియా మహారాజాస్ ఆదిలోనే వీరేంద్ర సెహ్వాగ్, పార్థివ్ పటేల్ వికెట్లను కోల్పోయింది. అయితే తన్మయ్, పఠాన్ చెలరేగి ఆడడంతో ఇండియా మహారాజాస్ గ్రాండ్ విక్టరీ అందుకుంది. 5 వికెట్లతో రాణించిన పంకజ్ సింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది. కాగా ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో ఈడెన్ గార్డెన్ స్టేడియం రంగురంగుల విద్యుద్దీపాలతో ధగధగా మెరిసిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
The #Legends with their winning trophy!
Congratulations to @IndMaharajasLLC on winning this special match. What a game!! #LegendsLeagueCricket #BossLogonKaGame #BossGame #LLCT20 pic.twitter.com/moNF9E4p80
— Legends League Cricket (@llct20) September 16, 2022
During the inning break @llct20 we had fun with lasers. #LegendsLeagueCricket #bosslogonkagame pic.twitter.com/ICyar90AY4
— Legends League Cricket (@llct20) September 16, 2022
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..