Viral: ఇది మ్యాచ్ కాదు.. సరికొత్త చరిత్ర.. 45 ఫోర్లు, 33 సిక్సర్లతో 515 పరుగులు.. టీ20 క్రికెట్‌లో రికార్డులు బద్దలు.. ఎక్కడంటే?

Multan Sultans vs Quetta Gladiators: పాకిస్థాన్ సూపర్ లీగ్ క్రికెట్‌లో అనేక రికార్డులు బ్రేక్ అయ్యాయి. ముల్తాన్ సుల్తాన్స్, క్వెట్టా గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్‌లో ఇది జరిగింది.

Viral: ఇది మ్యాచ్ కాదు.. సరికొత్త చరిత్ర.. 45 ఫోర్లు, 33 సిక్సర్లతో 515 పరుగులు.. టీ20 క్రికెట్‌లో రికార్డులు బద్దలు.. ఎక్కడంటే?
Pakistan Super League
Follow us
Venkata Chari

|

Updated on: Mar 12, 2023 | 12:44 PM

పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో టీ20 క్రికెట్ రికార్డులన్నీ బద్దలయ్యాయి. లీగ్‌లో బ్యాట్స్‌మెన్స్ పరుగుల వర్షం కురిపిస్తున్నారు. ముల్తాన్ సుల్తాన్స్ వర్సెస్ క్వెట్టా గ్లాడియేటర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మొత్తం 515 పరుగులు వచ్చాయి. ఇది టీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డుగా మారింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల నుంచి ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిసింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 45 ఫోర్లు, 33 సిక్సర్లు నమోదయ్యాయి. ఒకే మ్యాచ్‌లో PSL అత్యధిక స్కోరుగా నమోదైంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 262 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖాన్ 43 బంతుల్లో 120 పరుగులు చేశాడు. అతను 36 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేయడం ద్వారా PSL చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీని సాధించాడు. మహ్మద్ రిజ్వాన్ 29 బంతుల్లో 55 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

9 పరుగుల తేడాతో ఓటమి పాలు..

లక్ష్యాన్ని ఛేదించిన గ్లాడియేటర్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 253 పరుగులు మాత్రమే చేయగలిగింది. పీఎస్‌ఎల్‌లో ఇది రెండో అత్యధిక స్కోరు. గ్లాడియేటర్స్ తరపున ఉమర్ యూసుఫ్ 67 పరుగులు చేయగా, ఇఫ్తికార్ అహ్మద్ 31 బంతుల్లో 53 పరుగులు చేశారు. అబ్బాస్ అఫ్రిది 47 బంతుల్లో 5 వికెట్లు పడగొట్టి ముల్తాన్‌కు 9 పరుగుల తేడాతో విజయాన్ని అందించాడు. అఫ్రిది ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.

ముల్తాన్ వర్సెస్ క్వెట్టా గ్లాడియేటర్స్ జట్లు రెండూ కలిసి మొత్తం 515 పరుగులు చేశాయి. ఒకే టీ20లో అత్యధిక పరుగులు చేసిన మ్యాచ్‌గా ప్రపంచ రికార్డు సృష్టించింది.

ముల్తాన్ ఇన్నింగ్స్ 263 పరుగులతో పాకిస్థాన్ సూపర్ లీగ్ చరిత్రలో అతిపెద్ద స్కోరుగా నిలిచింది.

క్వెట్టా గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్ 253 పరుగులతో పాకిస్థాన్ సూపర్ లీగ్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరుగా నిలిచింది.

పాకిస్థాన్‌లో అతిపెద్ద టీ20 ఇన్నింగ్స్‌గా రికార్డు సృష్టించింది.

అంతేకాదు ఆసియాలోనే రెండో అతిపెద్ద టీ20 ఇన్నింగ్స్‌గా రికార్డు సృష్టించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!