IPL 2023: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ ప్లేయర్లు దూరం..

Mumbai Indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16 మార్చి 31 నుంచి ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.

IPL 2023: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ ప్లేయర్లు దూరం..
ఐపీఎల్ 16వ ఎడిషన్‌ ప్రారంభం కావడానికి ఇంకా వారం రోజులు కూడా లేదు. అయితే గత 15 సీజన్లను పరిశీలిస్తే వందలాది రికార్డుల నమోదయ్యాయి. ఈ క్రమంలో ఏ జట్టు అత్యధిక ఫోర్లు, సిక్సర్లు బాదిందన్నదే ముఖ్యమైనది. ముఖ్యంగా ఫోర్ల విషయానికి వస్తే అత్యధిక ఫోర్లు బాదిన జట్లలో ముంబై ఇండియన్స్ మొదటి స్థానంలో నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టు కూడా ముంబైయే కావడం ఇక్కడ విశేషం.
Follow us
Venkata Chari

|

Updated on: Mar 12, 2023 | 12:30 PM

IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16 మార్చి 31 నుంచి ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16 ప్రారంభం కాకముందే ముంబై ఇండియన్స్‌కు షాక్ తగిలింది. ఈసారి పటిష్టమైన జట్టుతో కప్ గెలవాలని ఆశించిన రోహిత్ శర్మ జట్టులోని ఇద్దరు ఆటగాళ్లు టోర్నీ ప్రారంభానికి ముందే జట్టును వీడారు.

కొద్ది రోజుల క్రితమే ముంబై ఇండియన్స్ లీడింగ్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. వెన్నునొప్పి సమస్య కారణంగా బుమ్రా ఇప్పుడు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అందుకే వచ్చే 6 నెలల పాటు ఆయన మైదానంలోకి దిగడం వీలుకాదు.

జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోవడంతో, ఇప్పుడు ముంబై ఇండియన్స్ జట్టుకు చెందిన మరో పేసర్ జే రిచర్డ్సన్ కూడా అతను ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు ధృవీకరించాడు. ఇటీవలే సర్జరీ చేయించుకోవడంతో ఆసీస్ పేసర్ అందుబాటులో ఉండడం లేదని పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్ సీజన్ 16లో జే రిచర్డ్‌సన్ కనిపించడు. అంతే కాకుండా భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌లో అతను పాల్గొనడం లేదు. అంటే ముంబై ఇండియన్స్ జట్టులోని ఇద్దరు ముఖ్యమైన బౌలర్లు ఐపీఎల్‌కు దూరమవడం రోహిత్ శర్మ జట్టుకు ఎదురుదెబ్బ తగలవచ్చని అంటున్నారు. ఎందుకంటే ముంబై ఇండియన్స్ జస్ప్రీత్ బుమ్రా, జే రిచర్డ్‌సన్‌ల స్థానంలో ఆటగాళ్లను ఎంపిక చేయాల్సి ఉంది. ఐపీఎల్ ప్రారంభానికి 20 రోజులు మాత్రమే మిగిలి ఉంది.

ముంబై ఇండియన్స్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), టిమ్ డేవిడ్, రమణదీప్ సింగ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రీవిస్, జోఫ్రా ఆర్చర్, అర్జున్ టెండూల్కర్, అర్షద్ ఖాన్, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకీన్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ ఆకాష్ మధ్వల్ , రాఘవ్ గోయల్, నేహాల్ వధేరా, షామ్స్ ములానీ, విష్ణు వినోద్, డువాన్ జాన్సెన్, పీయూష్ చావ్లా, కామెరూన్ గ్రీన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..