AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ ప్రసారాలను నిషేధించిన పాకిస్థాన్

ఇస్లామాబాద్‌ :ఐపీఎల్-2019 ప్రసారాలను పాకిస్తాన్‌లో నిషేధిస్తున్నట్టు పాకిస్థాన్ తెలిపింది. ఈ మేరకు ఆ దేశ సమాచార, ప్రసార శాఖ మంత్రి ఫవాద్‌ అహ్మద్‌ చౌద్రీ ప్రకటన విడుదల చేశారు. ‘ రాజకీయాలను, క్రీడలను వేరుగా చూడాలని భావించాం. కానీ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌) జరిగిన సమయంలో భారత ప్రభుత్వం, కంపెనీలు పాక్‌ క్రికెట్‌ పట్ల ప్రవర్తించిన తీరు మాకు గుర్తుంది. కాబట్టి ఐపీఎల్‌ ప్రసారాలు పాకిస్తాన్‌లో ప్రదర్శించబడటాన్ని మేము సహించలేం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని […]

ఐపీఎల్ ప్రసారాలను నిషేధించిన పాకిస్థాన్
Ram Naramaneni
|

Updated on: Mar 21, 2019 | 7:01 PM

Share

ఇస్లామాబాద్‌ :ఐపీఎల్-2019 ప్రసారాలను పాకిస్తాన్‌లో నిషేధిస్తున్నట్టు పాకిస్థాన్ తెలిపింది. ఈ మేరకు ఆ దేశ సమాచార, ప్రసార శాఖ మంత్రి ఫవాద్‌ అహ్మద్‌ చౌద్రీ ప్రకటన విడుదల చేశారు. ‘ రాజకీయాలను, క్రీడలను వేరుగా చూడాలని భావించాం. కానీ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌) జరిగిన సమయంలో భారత ప్రభుత్వం, కంపెనీలు పాక్‌ క్రికెట్‌ పట్ల ప్రవర్తించిన తీరు మాకు గుర్తుంది. కాబట్టి ఐపీఎల్‌ ప్రసారాలు పాకిస్తాన్‌లో ప్రదర్శించబడటాన్ని మేము సహించలేం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా భారత క్రికెటర్లు ఆర్మీ క్యాప్‌లతో ఆడటాన్ని కూడా పాక్ తీవ్రంగా తప్పుబట్టింది. భారత్‌ క్రికెట్ టీమ్‌పై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి విన్నవించుకుంది. అయితే ఐసీసీ… తమ పర్మీషన్‌ తీసుకున్నాకే వారు ఆర్మీ క్యాప్‌లు ధరించారని చెప్పడంతో చేసేది ఏం లేక మిన్నకుండిపోయింది. అయితే ఫిబ్రవరి 14న కశ్మీన్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మందికి పైగా భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. అదే రోజున పాకిస్థాన్ ప్రిమియర్ లీగ్ నాలుగవ సీజన్‌ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తూ భారత్‌ను ఇబ్బందుల పాలు చేస్తున్న కారణంగా.. భారత్‌లో పీఎస్‌ఎల్‌ ప్రసారాల్ని నిలిపివేస్తూ డీస్పోర్ట్‌ చానల్‌ నిర్ణయం తీసుకుంది.ఇక పాక్‌ ప్రధాని, ఆ దేశ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ ఫొటోలతో పాటు భారత్‌లోని వివిధ గ్రౌండ్స్‌లో ఉన్న పాక్ క్రికెటర్ల పోటోలను తొలిగించారు. మరీ ముఖ్యంగా పీఎస్ఎల్ కు అఫీషియల్ ప్రొడక్షన్ పార్టనర్ గా ఉన్న ఐఎంజీ రిలయన్స్ ఇకపై లీగ్ తో ఏ మాత్రం భాగస్వామ్యాన్ని కొనసాగించబోమని స్పష్టం చేసింది.

అందుకే పాక్ పక్కా రివేంజ్ ప్లాన్ చేసింది. మరో రెండు రోజుల్లో ప్రారంభమవనున్న ఐపీఎల్ మ్యాచులను ప్రసారం చేయకూడదని నిర్ణయం తీసుకుంది. అయితే దాని వల్ల ఇండియాకు పెద్ద ఇబ్బంది ఏమి లేదన్నది భారత క్రికెట్ వర్గాల నుంచి వస్తున్న మాట. అత్యంత సంపన్న క్రికెట్ లీగ్‌గా వృద్ధి చెందిన ఐపీఎల్ ఇయర్..ఇయర్‌కి తన ప్రాబల్యాన్ని పెంచుకుంటూ పోతున్న విషయం తెలిసిందే.

మీ చిరునవ్వు మీ వంటింట్లోనే.. పళ్లు వజ్రాల్లా మెరవాలంటే ఇవి తింటే
మీ చిరునవ్వు మీ వంటింట్లోనే.. పళ్లు వజ్రాల్లా మెరవాలంటే ఇవి తింటే
రెండో వన్డే నుంచి ఇద్దరు ఔట్.. సడన్‌గా వ్యూహం మార్చిన గంభీర్
రెండో వన్డే నుంచి ఇద్దరు ఔట్.. సడన్‌గా వ్యూహం మార్చిన గంభీర్
దేశంలో 9 కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు.. ఏయే మార్గాల్లో
దేశంలో 9 కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు.. ఏయే మార్గాల్లో
గేట్ 2026 అడ్మిట్ కార్డులు విడుదల.. రాత పరీక్షల తేదీలు ఇవే!
గేట్ 2026 అడ్మిట్ కార్డులు విడుదల.. రాత పరీక్షల తేదీలు ఇవే!
ఎస్‌బీఐ వినియోగదారులకు షాక్‌.. ఏటీఎం విత్‌డ్రా ఛార్జీల పెంపు!
ఎస్‌బీఐ వినియోగదారులకు షాక్‌.. ఏటీఎం విత్‌డ్రా ఛార్జీల పెంపు!
ఏపీ సెట్‌ 2026 పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
ఏపీ సెట్‌ 2026 పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
రూ. 15 లక్షల జీతం ఉన్నా రూపాయి కూడా ట్యాక్స్‌ అక్కర్లేదు..ఎలాగంటే
రూ. 15 లక్షల జీతం ఉన్నా రూపాయి కూడా ట్యాక్స్‌ అక్కర్లేదు..ఎలాగంటే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌ 2026 నోటిఫికేషన్‌ వాయిదా!
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌ 2026 నోటిఫికేషన్‌ వాయిదా!
మళ్లీ అదే జోరు.. ఏ మాత్రం తగ్గని బంగారం, వెండి ధరలు..
మళ్లీ అదే జోరు.. ఏ మాత్రం తగ్గని బంగారం, వెండి ధరలు..
అదిరిపోయే స్కీమ్.. ఒక్కసారి పెట్టుబడి పెడితే ప్రతి నెలా రూ.5,500
అదిరిపోయే స్కీమ్.. ఒక్కసారి పెట్టుబడి పెడితే ప్రతి నెలా రూ.5,500