షేన్‌వార్న్‌ సలహాలు అద్భుతం: సందీప్‌ లామిచానె

Ram Naramaneni

Ram Naramaneni |

Updated on: Mar 22, 2019 | 2:40 PM

డిల్లీ:  ప్రపంచ మెరుగైన స్పిన్నర్‌గా పేరొందిన షేన్‌వార్న్ సలహాలు తనకు ఉపకరిస్తాయంటున్నాడు యువ స్పిన్నర్‌ సందీప్‌ లామిచానె. ఆరాదించే వ్యక్తి ఇచ్చిన సూచనలు ఎప్పటికి మర్చిపోలేనని అన్నాడు.  ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు ధైర్యంగా బంతులు విసరాలని షేన్‌వార్న్ చెప్పాడన్నాడు . ఈ నేపాల్‌ కుర్రాడు రెండోసారి డిల్లీ  ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అదృష్టవశాత్తు ఐపీఎల్‌లో వార్న్ కలుసుకొనే అవకాశం వచ్చిందని….  తన బౌలింగ్‌‌ను మెరుగుపరుచుకొనేందుకు విలువైన సలహాలిచ్చారని…అవి తన కెరీర్‌ దిగ్విజయంగా సాగిపోయేందుకు అవి ఉపయోగపడ్డాయి అని సందీప్‌ […]

షేన్‌వార్న్‌ సలహాలు అద్భుతం: సందీప్‌ లామిచానె

డిల్లీ:  ప్రపంచ మెరుగైన స్పిన్నర్‌గా పేరొందిన షేన్‌వార్న్ సలహాలు తనకు ఉపకరిస్తాయంటున్నాడు యువ స్పిన్నర్‌ సందీప్‌ లామిచానె. ఆరాదించే వ్యక్తి ఇచ్చిన సూచనలు ఎప్పటికి మర్చిపోలేనని అన్నాడు.  ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు ధైర్యంగా బంతులు విసరాలని షేన్‌వార్న్ చెప్పాడన్నాడు . ఈ నేపాల్‌ కుర్రాడు రెండోసారి డిల్లీ  ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

అదృష్టవశాత్తు ఐపీఎల్‌లో వార్న్ కలుసుకొనే అవకాశం వచ్చిందని….  తన బౌలింగ్‌‌ను మెరుగుపరుచుకొనేందుకు విలువైన సలహాలిచ్చారని…అవి తన కెరీర్‌ దిగ్విజయంగా సాగిపోయేందుకు అవి ఉపయోగపడ్డాయి అని సందీప్‌ అన్నాడు. కాగా బిగ్‌బాష్ టీ20 లీగ్‌లో లామిచానె  అద్భుతంగా రాణించాడు. తన కెరీర్‌లో ఐపీఎల్‌  ఓ మధురస్మృతి అని టెస్టులకు అర్హత సాధించని జట్ల ఆటగాళ్లకు ఇది మంచి వేదిక’ అని లామిచానె అభిప్రాయపడ్డాడు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu