ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ స్కోర్స్ చేసిన జట్లు ఇవే..!

ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ స్కోర్స్ చేసిన జట్లు ఇవే..!

ఐపీఎల్ కోసం ఎంతో మంది అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. భారీ సిక్సర్లు, బౌండరీలతో ఎంటర్టైన్ చేసే ఈ ఐపీఎల్ లో బౌలర్లకు ప్రాధాన్యం తక్కువ గానే ఉంటుంది. అయితే ఐపీఎల్ లో కూడా కొంతమంది బౌలర్లు తమ సత్తా చాటారు. వారి కారణంగా 100 పరుగులు కూడా దాటకుండా చాలాసార్లు జట్లు చాప చుట్టేశాయి. ఇంకా చెప్పాలంటే మన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సారధ్యంలో నడిచే రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఈ […]

Ravi Kiran

|

Mar 22, 2019 | 4:07 PM

ఐపీఎల్ కోసం ఎంతో మంది అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. భారీ సిక్సర్లు, బౌండరీలతో ఎంటర్టైన్ చేసే ఈ ఐపీఎల్ లో బౌలర్లకు ప్రాధాన్యం తక్కువ గానే ఉంటుంది. అయితే ఐపీఎల్ లో కూడా కొంతమంది బౌలర్లు తమ సత్తా చాటారు. వారి కారణంగా 100 పరుగులు కూడా దాటకుండా చాలాసార్లు జట్లు చాప చుట్టేశాయి. ఇంకా చెప్పాలంటే మన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సారధ్యంలో నడిచే రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఈ రికార్డు లో టాప్ ప్లేస్ లో ఉండడం గమనార్హం. ఇంక లేట్ ఎందుకు పదండి ఆ జట్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 49 పరుగులకు ఆలౌట్ అయింది. (ప్రత్యర్థి: కోల్ కత్తా నైట్ రైడర్స్ (23-ఏప్రిల్-2017) వేదిక: కోల్ కత్తా

రాజస్థాన్ రాయల్స్ 58 పరుగులకు ఆలౌట్ అయింది. (ప్రత్యర్థి: రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు(18-ఏప్రిల్-2009) వేదిక: కేప్ టౌన్

ఢిల్లీ డేర్ డెవిల్స్ 66 పరుగులు చేసింది. (ప్రత్యర్థి: ముంబై ఇండియన్స్ (6-మే-2017) వేదిక: ఢిల్లీ

ఢిల్లీ డేర్ డెవిల్స్ 67 పరుగులు చేసింది. (ప్రత్యర్థి: కింగ్స్ XI పంజాబ్ (30-ఏప్రిల్-2017) వేదిక: మొహాలీ

కోల్ కత్తా నైట్ రైడర్స్ 67 పరుగులు చేసింది. (ప్రత్యర్థి: ముంబై ఇండియన్స్ (16-మే-2008) వేదిక: ముంబై

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు 70 పరుగులు చేసింది. (ప్రత్యర్థి: రాజస్థాన్ రాయల్స్ (26-ఏప్రిల్-2014) వేదిక: అబుదాబీ

కింగ్స్ XI పంజాబ్ 73 పరుగులు చేసింది. (ప్రత్యర్థి: రైజింగ్ పూణే సూపర్ జేయంట్స్  (14-మే-2017) వేదిక: పూణే

కొచ్చి టస్కర్స్ కేరళ 74 పరుగులు చేసింది. (ప్రత్యర్థి: డెక్కన్ ఛార్జర్స్ (27-ఏప్రిల్-2011) వేదిక: కొచ్చి

చెన్నై సూపర్ కింగ్స్ 79 పరుగులు చేసింది. (ప్రత్యర్థి: ముంబై ఇండియన్స్ (5-మే-2013) వేదిక: ముంబై

ఢిల్లీ డేర్ డెవిల్స్ 80 పరుగులు చేసింది. (ప్రత్యర్థి: సన్ రైజర్స్ హైదరాబాద్ (4-మే-2013) వేదిక: హైదరాబాద్

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu