AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కౌంటీ క్రికెట్‌లో సంచలనం..25 బంతుల్లో సెంచరీ

దుబాయి: ఇంగ్లాండ్‌ కౌంటీ క్రికెట్‌లో  సంచలనం నమోదైంది.  ఇంగ్లాండ్‌కు చెందిన యంగ్ క్రికెటర్‌ విల్‌జాక్స్‌ 25 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అందులోనూ ఎప్పుడో అరుదుగా సంభవించే ఒకే ఓవర్‌లో  ఆరు సిక్సుల ఫీట్‌తో అదరహో అనిపించాడు. కుర్ర క్రికెటర్ బంతిని బాదుతున్న తీరు చూసి..కళ్లప్పగించి చూడటం బౌలర్ల వంతైదంట.   ఇంగ్లాండ్‌ కౌంటీ క్రికెట్‌లో భాగంగా లాంకాషైర్‌, సర్రే జట్ల మధ్య గురువారం దుబాయిలో టీ10  మ్యాచ్‌ జరిగింది. మొదట బ్యాటింగ్‌ చేసిన సర్రే జట్టు మూడు వికెట్ల […]

కౌంటీ క్రికెట్‌లో సంచలనం..25 బంతుల్లో సెంచరీ
Ram Naramaneni
|

Updated on: Mar 22, 2019 | 3:05 PM

Share

దుబాయి: ఇంగ్లాండ్‌ కౌంటీ క్రికెట్‌లో  సంచలనం నమోదైంది.  ఇంగ్లాండ్‌కు చెందిన యంగ్ క్రికెటర్‌ విల్‌జాక్స్‌ 25 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అందులోనూ ఎప్పుడో అరుదుగా సంభవించే ఒకే ఓవర్‌లో  ఆరు సిక్సుల ఫీట్‌తో అదరహో అనిపించాడు. కుర్ర క్రికెటర్ బంతిని బాదుతున్న తీరు చూసి..కళ్లప్పగించి చూడటం బౌలర్ల వంతైదంట.   ఇంగ్లాండ్‌ కౌంటీ క్రికెట్‌లో భాగంగా లాంకాషైర్‌, సర్రే జట్ల మధ్య గురువారం దుబాయిలో టీ10  మ్యాచ్‌ జరిగింది. మొదట బ్యాటింగ్‌ చేసిన సర్రే జట్టు మూడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో విల్‌ జాక్స్‌ 30 బంతుల్లో 105 పరుగులతో చేసిన విరోచిత బ్యాటింగ్‌ ఇన్నింగ్స్ ఒక సాదాసీదా మ్యాచ్ గురించి క్రికెట్ ప్రపంచం మొత్తం చర్చించుకునేలా చేసింది.  తరువాత బ్యాటింగ్‌ చేసిన లాంకాషైర్‌ జట్టు నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 81పరుగులు చేసి ఓటమి చవిచూసింది

పస్ట్  బంతి నుంచే నాకిష్టమైన షాట్లు ఆడాలానుకున్నా. దొరికిన ప్రతీ బంతిని బౌండరీ కొట్టా. ఆరు బంతుల్లో ఆరు సిక్సులు సాధించా. ఇంతకుముందెప్పుడూ నేనిలా ఆడలేదు. ఇంత మంచి ఇన్నింగ్స్‌ ఆడటం నాకెంతో గర్వంగా ఉంది. ఈ మ్యాచ్ నాకెప్పటికి మెమరబుల్’ అని మ్యాచ్ అనంతరం విల్‌జాక్స్ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్‌కు అధికారిక హోదా లేకపోడంతో విల్‌జాక్స్‌ విరోచిత ఇన్నింగ్స్ క్రికెట్‌ రికార్డులోకి చోటు దక్కించుకోలేకపోయింది. అదే కానీ జరిగితే ఇప్పటివరకు ఉన్న రికార్డులు అన్నీ తుడిచిపెట్టుకుపోయేవి.

Follow Us