AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

174 బంతుల్లో 36 పరుగులు.. వన్డేల్లో టెస్ట్ మ్యాచ్‌ ఆడిన భారత దిగ్గజం.. కోపంతో ఊగిపోయిన ఫ్యాన్స్.. ఎవరో తెలుసా?

ఈ భారత దిగ్గజం చాలా నిదానంగా ఇన్నింగ్స్‌ కొనసాగించడంతో క్రికెట్‌ అభిమానులు కోఫంతో ఊగిపోయారు. 7 జూన్ 1975న ఇంగ్లాండ్‌తో జరిగిన ప్రపంచ కప్‌ మొదటి మ్యాచ్‌లోనే స్లో ఇన్నింగ్స్‌తో..

174 బంతుల్లో 36 పరుగులు.. వన్డేల్లో టెస్ట్ మ్యాచ్‌ ఆడిన భారత దిగ్గజం.. కోపంతో ఊగిపోయిన ఫ్యాన్స్.. ఎవరో తెలుసా?
Sunil Gavaskar
Venkata Chari
|

Updated on: Jun 07, 2022 | 11:11 AM

Share

భారతదేశపు దిగ్గజ బ్యాట్స్‌మెన్‌లలో సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) ఒకరు. 70, 80లలో భారత బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచాడు. అయితే ఓ విషయంలో మాత్రం తీవ్రమైన విమర్శలను ఎదుర్కొన్నాడు. నేటికి 47 ఏళ్ల క్రితం వన్డే వరల్డ్‌కప్‌ వేదికపై ఓ ఇన్నింగ్స్‌‌ ఆడిన అతడు.. వన్డేల్లో టెస్టు మ్యాచ్‌ చూస్తున్న అనుభూతిని కలిగించాడు. గవాస్కర్ ఆ ఇన్నింగ్స్ చాలా నిదానంగా సాగడంతో.. అతడిని చూడగానే క్రికెట్ అభిమానుల ఓపిక నశించింది. 7 జూన్ 1975న ఇంగ్లాండ్‌తో జరిగిన ప్రపంచ కప్‌(World Cup)లో మొదటి మ్యాచ్‌లో స్లో ఇన్నింగ్స్‌తో విసుగు పుట్టించాడు. అయితే, అప్పట్లో వన్డే క్రికెట్ 50 ఓవర్లు కాదు.. 60 ఓవర్ల పాటు ఆడేవారు. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడిన భారత్‌(IND vs ENG) ఘోర పరాజయం పాలైంది. భారత్ ఓటమిలో సునీల్ గవాస్కర్ స్లో ఇన్నింగ్స్, అతని బ్యాటింగ్ చర్చనీయాంశమైంది.

మొదటి వన్డే ప్రపంచకప్ 1975లో జరిగింది. ఆ ప్రపంచకప్‌లో భారత్‌ తొలిసారిగా ఇంగ్లండ్‌తో తలపడింది. జూన్ 7న జరిగిన మ్యాచ్‌లో సునీల్ గవాస్కర్ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. కానీ, అతను ఆడిన తీరు చూస్తే తోటి ఆటగాళ్లతోపాటు క్రికెట్ అభిమానులు కూడా ఇలాంటి పరిస్థితిని ఊహించలేదు. దీంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

174 బంతుల్లో 36 పరుగులు..

ఇవి కూడా చదవండి

ఇంగ్లండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో 174 బంతులు ఎదుర్కొన్న సునీల్ గవాస్కర్ కేవలం 36 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సమయంలో అతని బ్యాటింగ్ సగటు 20.69గా నమోదైంది. వన్డే క్రికెట్‌లో గవాస్కర్ ఇన్నింగ్స్‌లో కేవలం ఒక ఫోర్ మాత్రమే వచ్చింది. దీంతో ఇది టెస్ట్ మ్యాచ్ అనుభూతిని కలిగించింది.

ఓపెనర్‌గా గవాస్కర్ నెమ్మదిగా ఆడడడంతో.. అది టీమ్ ఇండియాపై కూడా ప్రభావం చూపింది. భారత జట్టు స్లో ఇన్నింగ్స్ కారణంగా 60 ఓవర్లలో 3 వికెట్లకు 132 పరుగులు మాత్రమే చేసింది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 202 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

ఇంగ్లండ్ భారీ స్కోరు..

ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసింది. లార్డ్స్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 60 ఓవర్లలో మొత్తం 334 పరుగులు చేసింది. ఇది ఆ సమయంలో అత్యధిక స్కోరుగా నిలిచింది. ఇంగ్లండ్‌లో డెన్నిస్ అమిస్ 137 పరుగులు, కీత్ ఫ్లెచర్ 68 పరుగులతో ఆకట్టుకున్నారు. అదే సమయంలో క్రిస్ ఓల్డ్ 51 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు.

ఆ ఇన్నింగ్స్‌ అభిమానుల సహనానికి ఓ పరీక్ష..

335 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సునీల్ గవాస్కర్ చాలా నెమ్మదిగా ఆడడంతో అభిమానుల ఓపిక నశించింది. వారు ఆగ్రహంతో నిరసన తెలిపారు. కొందరు చాలా ఆశ్చర్యపోయారు. మైదానంలోకి దిగిన తర్వాత వారు తమ నిరసనను తెలియజేయడానికి గవాస్కర్ వద్దకు చేరుకున్నారు.

కాగా, చాలా సంవత్సరాల తర్వాత, ఒక ఇంటర్వ్యూలో, గవాస్కర్ తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ, “నేను ఆ ఇన్నింగ్స్‌లో చాలాసార్లు అవుట్ అవ్వాలని ప్రయత్నించాను. కానీ, ఔట్ కాలేదు. నేను కూడా ఔట్ కావడానికి నా స్టంప్‌ను చాలాసార్లు జారవిడుచుకున్నాను. కానీ, అప్పటికీ నా వికెట్ పడలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు