హ్యాండిచ్చిన జాతీయ జట్టు.. కట్ చేస్తే.. 33 బంతుల్లో తుఫాన్ ఇన్నింగ్స్.. 6గురి బౌలర్ల ఊచకోత..

డొమెస్టిక్ క్రికెట్‌లో సత్తా చాటుతున్న క్రికెటర్.. ఆకాశమే హద్దుగా బౌండరీలతో చెలరేగిపోతాడు.. సిక్స్ కొట్టాడంటే.. మబ్బులులోకి వెళ్ళాల్సిందే.. అతడెవరో తెలుసా!

హ్యాండిచ్చిన జాతీయ జట్టు.. కట్ చేస్తే.. 33 బంతుల్లో తుఫాన్ ఇన్నింగ్స్.. 6గురి బౌలర్ల ఊచకోత..
England T20 Blast
Follow us

|

Updated on: Jun 07, 2022 | 10:49 AM

అతడు వచ్చాడు.. ఆడాడు.. గెలిపించాడు.. జాతీయ జట్టు హ్యండిచ్చినా.. డొమెస్టిక్ క్రికెట్‌లో తన సత్తాను నిరూపిస్తూ వస్తున్నాడు. జట్టు ఏదైనా కూడా విధ్వంసం తప్పదన్నట్లు ఆకాశమే హద్దుగా బౌండరీలతో చెలరేగిపోతూ ప్రత్యర్ధులకు హెచ్చరికలు జారీ చేస్తాడు. ఐపీఎల్‌లోనూ క్యామియో రోల్‌లో ప్లే చేసిన ఆ ఆటగాడు ఎవరో కాదు అలెక్స్ హేల్స్.

ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టీ20 బ్లాస్ట్‌లో నాటింగ్హామ్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న అలెక్స్ హేల్స్ విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఇటీవల డెర్బీషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో హేల్స్ ప్రత్యర్ధులపై తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. ఇందులో తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న నాటింగ్హామ్‌షైర్.. డెర్బీషైర్‌ను బ్యాటింగ్‌కు దింపింది. ఆ జట్టుకు ఓపెనర్లు మసూద్(33), రీస్(27) అర్ధ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పగా.. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు మద్సేన్(40), ప్లూయ్(51) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో డెర్బీషైర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 178 పరుగులకు ఆలౌట్ అయింది. నాటింగ్హామ్‌షైర్‌ బౌలర్లలో బాల్ 4 వికెట్లు, పాటిన్సన్ 2 వికెట్లు.. హారిసన్, సమిట్ పటేల్‌లు చెరో వికెట్ పడగొట్టారు.

ఇక 179 పరుగుల లక్ష్యచేధనతో బరిలోకి దిగిన నాటింగ్హామ్‌షైర్‌‌కు.. ఓపెనర్ అలెక్స్ హేల్స్(91) చక్కటి ఆరంభాన్ని ఇవ్వడమే కాదు.. అద్భుత విజయాన్ని అందించడంలోనూ కీలక పాత్ర పోషించాడు. రెండో ఓపెనర్‌గా బరిలోకి దిగిన హేల్స్.. 33 బంతుల్లో 275 స్ట్రైక్ రేట్‌తో 12 ఫోర్లు, 5 సిక్సర్ల సహాయంతో 91 పరుగులు చేశాడు. అతడ్ని ఎదుర్కునేందుకు ప్రత్యర్ధి జట్టు 6గురి బౌలర్లను బరిలోకి దింపినప్పటికీ.. ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. ఆ బౌలర్లను బౌండరీల రూపంలో చితకబాదేశాడు.