AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NZ vs PAK Probable Playing XI: తొలి సెమీస్‌కు రంగం సిద్ధం.. రికార్డులన్నీ పాక్‌వైపే.. సమతూకంతో కివీస్.. ప్లేయింగ్ XI ఎలా ఉందంటే?

ICC T20 World Cup New Zealand vs Pakistan, 1st Semi-Final Playing XI: పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య సిడ్నీలో తొలి సెమీ ఫైనల్ జరగనుంది.

NZ vs PAK Probable Playing XI: తొలి సెమీస్‌కు రంగం సిద్ధం.. రికార్డులన్నీ పాక్‌వైపే.. సమతూకంతో కివీస్.. ప్లేయింగ్ XI ఎలా ఉందంటే?
NZ vs PAK Probable Playing XI
Venkata Chari
|

Updated on: Nov 08, 2022 | 8:54 PM

Share

NZ vs PAK Probable Playing XI: సిడ్నీ మైదానం సిద్ధమైంది. టీ20 ప్రపంచ కప్ 2022 తొలి సెమీ-ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. ఇందులో పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ బుధవారం తలపడతాయి. గ్రూప్ 1 నుంచి నంబర్ వన్ స్థానంతో న్యూజిలాండ్ జట్టు సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది. మరోవైపు గ్రూప్ 2 నుంచి పాకిస్థాన్ సెమీఫైనల్‌కు చేరుకుంది. ఆరంభంలో పేలవంగా రాణించినా.. చివర్లో అదృష్టం, కఠోర శ్రమతో పాకిస్థాన్ జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. ఇప్పుడు పాకిస్థాన్-న్యూజిలాండ్ ముఖాముఖి పోరులో ఎవరు గెలిస్తే వారు టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకుంటారు. దీంతో అందరి చూపు తొలి సెమీస్‌పైనే నిలిచింది.

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే గణాంకాల పరంగా చూస్తే, న్యూజిలాండ్‌పై పాకిస్తాన్‌కు భారీ ప్రయోజనం ఉంది. టీ20లో వీరిద్దరూ 28 సార్లు తలపడగా, పాకిస్థాన్ 17 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో కూడా పాకిస్థాన్ 4 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌ను ఓడించగా, 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఐసీసీ టోర్నీల సెమీ ఫైనల్స్‌లో ఇరు జట్లు ఇప్పటి వరకు 3 సార్లు తలపడగా, ప్రతిసారీ పాకిస్థాన్ జట్టుకే విజయం సొంతమైంది. అయితే ఈసారి కివీస్ జట్టు పాకిస్థాన్ కంటే సమతూకంతో ఉండడంతో పైచేయి సాధిస్తుందని భావిస్తున్నారు. రెండు జట్లు ఎలాంటి ప్లేయింగ్ XIతో మైదానంలోకి దిగవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

న్యూజిలాండ్ జట్టులో సమతూకం..

న్యూజిలాండ్ జట్టులో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఫిన్ అలెన్, గ్లెన్ ఫిలిప్స్ ఆధారంగా పాక్ బౌలర్లను నియంత్రించేందుకు విలియమ్సన్ జట్టు ప్రయత్నిస్తుంది. అదే సమయంలో ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్, టిమ్ సౌథీల జోడీ పాక్ బ్యాట్స్‌మెన్‌లను బౌలింగ్‌లో ఇబ్బంది పెట్టగలదు. 5గురు బ్యాట్స్‌మెన్స్, ఇద్దరు ఆల్ రౌండర్లు, ముగ్గురు స్టార్ బౌలర్లతో కివీ జట్టు మైదానంలోకి రానుంది. ఇక సాంట్నర్, సోధి లాంటి ఇద్దరు అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

న్యూజిలాండ్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI – ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్, డారెల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.

బౌలింగ్ బలంగా పాకిస్థాన్..

పాకిస్థాన్ క్రికెట్ జట్టు బ్యాటింగ్ బలహీనంగా ఉన్నప్పటికీ బౌలింగ్ బలంగా ఉంది. పాక్ వద్ద ఒక బౌలర్ మాత్రమే ఉన్నాడు. ఆ బౌలర్ ఎకానమీ రేటు ఓవర్‌కు 7 పరుగుల కంటే ఎక్కువగా నిలిచింది. అతని టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్‌లో ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయింది.

పాకిస్థాన్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI – మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం , మహ్మద్ నవాజ్, మహ్మద్ హరీస్, షాన్ మసూద్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ వసీం, నసీమ్ షా, హరీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..