AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: ఆడకుండానే ఫైనల్ చేరనున్న టీమిండియా, కివీస్ జట్లు.. పాక్, ఇంగ్లండ్ టీంలకు భారీ షాకే.. ఎందుకంటే?

IND vs ENG, NZ vs PAK: టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో, భారత జట్టు ఇంగ్లాండ్‌తో ఆడనున్నాయి. అయితే సెమీ-ఫైనల్ మ్యాచ్ కూడా ఆడకుండానే రెండు జట్లూ ఫైనల్‌కు చేరుకునే అవకాశం ఉంది.

T20 World Cup: ఆడకుండానే ఫైనల్ చేరనున్న టీమిండియా, కివీస్ జట్లు.. పాక్, ఇంగ్లండ్ టీంలకు భారీ షాకే.. ఎందుకంటే?
T20 world cup 2022 Semi Finals
Venkata Chari
|

Updated on: Nov 08, 2022 | 8:49 PM

Share

టీ20 ప్రపంచకప్2022(T20 World Cup 2022) చివరి దశకు చేరుకుంది. 4 సెమీఫైనలిస్ట్ జట్లను నిర్ణయించారు. తొలి సెమీఫైనల్‌లో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు తలపడనుండగా, రెండో సెమీఫైనల్‌లో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమ్ ఇండియా 15 ఏళ్ల తర్వాత టైటిల్ గెలవాలని చూస్తోంది. అయితే, అంతకంటే ముందు భారత్ ఇంగ్లాండ్‌ను ఓడించాల్సి ఉంటుంది. అయితే టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్ కూడా ఆడకుండానే భారత జట్టు ఫైనల్ చేరగలదనే వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అది ఎలా జరుగుతుందని అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం..

భారత్‌ మాత్రమే కాదు, న్యూజిలాండ్‌ కూడా సెమీ ఫైనల్‌ ఆడకుండానే టైటిల్‌ మ్యాచ్‌కు చేరుకోగలదని అంటున్నారు. సెమీఫైనల్‌లు రెండూ వర్షం కారణంగా కొట్టుకుపోయిన పరిస్థితిలో మాత్రమే భారత్, న్యూజిలాండ్ జట్లు ఆడకుండానే ఫైనల్‌కు చేరుకోగలవు. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు జట్ల మధ్య టైటిల్ మ్యాచ్ జరగొచ్చని భావిస్తున్నారు.

అగ్రశ్రేణి జట్లు నేరుగా ఫైనల్‌కు..

నియమం ప్రకారం, మ్యాచ్ రద్దు అయితే, రెండు గ్రూపులలోని అగ్రశ్రేణి జట్లు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటాయి. న్యూజిలాండ్ జట్టు 7 పాయింట్లతో గ్రూప్ 1లో అగ్రస్థానంలో ఉండగా, భారత్ 8 పాయింట్లతో గ్రూప్ 2లో అగ్రస్థానంలో ఉంది. నవంబర్ 9న సిడ్నీలో న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనుండగా, నవంబర్ 10న అడిలైడ్‌లో భారత్ సవాల్ చేయనుంది.

ఇవి కూడా చదవండి

సిడ్నీలో వర్ష సూచన..

సిడ్నీ వాతావరణం గురించి మాట్లాడితే, మ్యాచ్ రోజున 50 శాతానికి పైగా వర్షం పడే అవకాశం ఉంది. వాతావరణం క్షణక్షణం మారుతున్నప్పటికీ.. ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వర్షం కురవకూడదని, లేకుంటే ఆడకుండానే ఔటవుతుందని పాకిస్థాన్ ప్రార్థిస్తూ ఉండాలి. మరోవైపు, నవంబర్ 10 న అడిలైడ్ వాతావరణం గురించి మాట్లాడితే, వర్షం పడే అవకాశం 4 శాతం మాత్రమే ఉంది. అంటే భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది.

వర్షం పడినా ఫైనల్‌కు టీమిండియా..

న్యూజిలాండ్ గ్రూప్‌లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఐర్లాండ్, ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి. వర్షం కారణంగా గ్రూప్‌లోని కివీ జట్టు ఇప్పటికే ఒక మ్యాచ్ కొట్టుకుపోయింది. అదే సమయంలో, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లు భారత్ గ్రూప్‌లో ఉన్నాయి. గ్రూప్ 2లో భారత్ మ్యాచ్ వర్షం కారణంగా వాష్ అవ్వలేదు. అయితే, సెమీ ఫైనల్‌లో వర్షం కురిసినా భారత అభిమానులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రెండింటిలోనూ భారత్‌కు నష్టం వాటిల్లలేదు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా