IND vs ENG: విరాట్ కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్ తర్వాత భారత టెస్ట్ జట్టు ప్లేయింగ్ XI అంచనా!
విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత, భారత జట్టు ప్లేయింగ్ ఎలవెన్‌లో పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. రోహిత్, అశ్విన్ కూడా టెస్ట్‌లకు వీడ్కోలు పలికినందున, ఇది యువ ఆటగాళ్లకు అవకాశాల వేదికగా మారింది. యషస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, KL రాహుల్ వంటి యువ ఆటగాళ్లు కీలక పాత్ర పోషించనున్నారు. బౌలింగ్‌లో బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్, జడేజా వంటి ఆటగాళ్లు భారత్‌కు విజయానికి దారి చూపనున్నారు.

భారత క్రికెట్ అభిమానులకు డిజప్పాయింట్ చేస్తూ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించాడు. ఇది ఊహించినదే అయినప్పటికీ, భారత క్రికెట్‌కు ఇది ఒక పెద్ద లోటే. ఈ మధ్యనే రోహిత్ శర్మ కూడా టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మధ్యలో రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇది నూతన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్‌కు ఆరంభం కూడా. దీంతో రాబోవు రోజుల్లో టీమిండియాకు ప్లేయింగ్ ఎలవెన్ గురించి అంచనా మొదలైంది.
రోహిత్, విరాట్ కోహ్లీ తర్వాత భారత జట్టు తుది ఎంపిక (India Best Playing XI):
1. యషస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal): ఇటీవలి ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో రెండు డబుల్ సెంచరీలు, మూడు అర్ధ శతకాలు సాధించిన జైస్వాల్ ఓపెనర్‌గా దాదాపుగా ఖాయం.
2. కె.ఎల్. రాహుల్ (KL Rahul): ఆస్ట్రేలియాలోని పర్థ్ టెస్ట్‌లో జైస్వాల్‌తో కలిసి 201 పరుగుల భాగస్వామ్యం అందించి జట్టుకు విజయ బాట పట్టించాడు. ఇంగ్లాండ్‌లో సెంచరీ చేసిన అనుభవం కూడా ఉంది.
3. శుభ్‌మన్ గిల్ (Shubman Gill – కెప్టెన్): నంబర్ 3 స్థానం కోసం ఉత్తమ ఎంపిక. కెప్టెన్‌గా అవకాశం రావొచ్చు. గబ్బా టెస్ట్‌లో చేసిన 91 పరుగులు ఇప్పటికీ గుర్తుంటాయి.
4. అజింక్య రహానే / కరుణ్ నాయర్ (Rahane/Nair): ఇంగ్లాండ్‌లో ఎక్కువ అనుభవం ఉన్న రహానే లేదా ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేసిన కరుణ్ నాయర్‌కి అవకాశం ఉండొచ్చు.
5. రిషభ్ పంత్ (Rishabh Pant – వికెట్ కీపర్):ఇంగ్లాండ్‌లో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేసిన అనుభవం ఉన్న పంత్, లోయర్ మిడిల్ ఆర్డర్‌లో కీలకంగా మారతాడు.
బౌలింగ్ ఎంపికలు:
6. నితీష్ కుమార్ రెడ్డి (Nitsh Kumar Reddy): టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా కూడా ఆడగల ఈ యువ ఆటగాడు, మధ్య మాద్యం పేస్‌తో ఇంగ్లాండ్‌లో ప్రధాన ఆయుధంగా మారొచ్చు.
7. రవీంద్ర జడేజా (Ravindra Jadeja): ఇంగ్లాండ్‌లో సెంచరీ చేయడం, మంచి బ్యాటింగ్ నైపుణ్యం ఉండటం వల్ల జడేజా కీలక పాత్ర పోషించవచ్చు. బౌలింగ్‌లో తన సగటు మెరుగుపరచాల్సిన అవసరం ఉంది.
8. ప్రసిద్ధ్ క్రిష్ణా (Prasidh Krishna): వికెట్లు తీయగల శక్తి ఉన్న ప్రసిద్ధ్ ఈసారి విదేశీ టెస్ట్ సిరీస్‌లో ఔట్‌స్టాండింగ్ ప్రదర్శన ఇవ్వవచ్చు.
9. మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj): 2021లో ఇంగ్లాండ్‌లో 23 వికెట్లు తీయడంతో తన ప్రభావాన్ని ఇప్పటికే చూపించాడు. లైన్, లెంగ్త్ కంట్రోల్‌తో పనిచేసే ఓ హార్డ్ వర్కింగ్ బౌలర్.
10. జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah): ఆరోగ్యంగా ఉంటే బుమ్రా అనేది టీమ్‌కు బ్రహ్మాస్త్రం. స్వింగ్, సీమ్‌తో ఎవరినైనా కష్టపెడగల శక్తి ఉన్న ప్రధాన బౌలర్.
11. ఆకాశ్ దీప్ (Akash Deep): ఇటీవల ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌కు వ్యతిరేకంగా మంచి లైన్, లెంగ్త్‌తో ప్రభావం చూపించిన ఆకాశ్ దీప్, మరో అవకాశం కోసం సిద్ధంగా ఉన్నాడు.
ఈ జట్టుతో భారత్ టెస్ట్ ఫార్మాట్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది. కోహ్లీ, రోహిత్, అశ్విన్ లాంటి దిగ్గజాల రిటైర్మెంట్ తర్వాత యువతకు అవకాశాల వేదిక ఇది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



